టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎంతో రిజర్వుడ్‌గా ఉంటాడన్న విషయం తెలిసిందే. అందుకే ఆయన ఎవరితోనూ పెద్దగా కలిసి ఉన్నట్లు కనిపించడు. చాలా తక్కువ మందితోనే ఈ మెగా హీరో స్నేహం చేస్తుంటాడు. అందులో సీనియర్ కమెడియన్ అలీ ఒకరు. చాలా కాలంగా ఎంతో స్నేహంగా ఉంటోన్న వీళ్లిద్దరి మధ్య కొంత గ్యాప్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ పరిస్థితి తలెత్తడానికి కారణం రాజకీయాలే అని కూడా తెలుసు.ఈ నేపథ్యంలో 1999లో తెలుగుదేశం పార్టీలో చేరి.. దాదాపు 20 ఏళ్ల పాటు ఆపార్టీలోనే కొనసాగిన అలీ.. 2019లో వైసీపీ పార్టీలో చేరారు. ఆ పార్టీ తరుపున ప్రచారం చేసి.. 2022లో ఏపీ ఎలక్రానిక్ మీడియా సలహాదారుడిగా నామినేటెడ్ పదవిని అందుకున్నారు. అయితే 2024లో అలీకి సీటు నిరాకరించగా.. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. టీడీపీ-జనసేన కూటమి అఖండ విజయాన్ని సాధించగా.. అలీ వైసీపీ పార్టీకి రాజీనామా చేసి నటుడిగా కొనసాగుతానని స్పష్ఠం చేశారు.తాను రాజకీయాల్లో ఎవర్నీ వ్యక్తిగతంగా విమర్శించలేదని.. ఇకపై తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదంటూ రాజకీయాలకు స్వస్తి పలికారు కమెడియన్ అలీ. అయితే అలీ.. వైసీపీని వీడంటంతో జనసైనికులు ఓ రేంజ్‌లో ట్రోల్ చేశారు. ఎందుకంటే.. అలీ, పవన్ కళ్యాణ్‌లు బెస్ట్ ఫ్రెండ్స్. పవన్ కళ్యాణ్ సినిమాల్లో దాదాపు చాలా వాటిలో అలీ కలిసి చేశారు. పవన్ సినిమా అంటే అలీ కోసం ఒక క్యారెక్టర్ ప్రత్యేకించి రాసేవారంటే వీళ్లిద్దరి బాండింగ్ ఏ రేంజ్‌లో ఉండేదో అర్ధం చేసుకోవచ్చు.అలాంటి పవన్ కళ్యాణ్‌ని కాదని.. ప్రత్యర్థి పార్టీలో చేరి.. జనసేన పార్టీపై విమర్శలు గుప్పిచడంతో అలీపై మెగా అభిమానులు ఆగ్రహంతో ఉండేవారు.
అయితే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు కానీ.. ఆ తరువాత కానీ.. తనని రమ్మని పిలవలేదని.. తాను వెళ్లలేదని సమర్ధించుకున్నారు అలీ. ఇక పవన్ నాయకత్వంలోని జనసేన.. 100 పర్సంట్ స్ట్రైక్ రేట్‌తో 21 ఎమ్మెల్యే స్థానాలను గెలవడమే కాకుండా.. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యారు.
ఇదిలావుండగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై టాలీవుడ్ నటుడు అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఉత్సవం' సినిమా విజయోత్సవ వేడుకలో పాల్గొన్న అలీ,పవన్ కళ్యాణ్ తో తన అనుబంధం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ తో మీ అనుబంధం ఎలా ఉందని ఓ విలేఖరి ప్రశ్నించగా.. మా అనుబంధం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉందని నవ్వులు పూయించారు అలీ. ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే తప్పకుండా పని చేస్తానని ఈ సందర్భంగా అలీ వివరణ ఇచ్చారు.ఇదిలావుండగా మళ్లీ పవన్ కళ్యాణ్ భజన స్టార్ట్ చేశావా నాయనా? నీకు ఇప్పుడు తెలిసి వచ్చిందా? పవన్ కళ్యాణ్ లేకపోతే కష్టం అని కావాలనే ఆ పేరు చెప్పాడు? వైసీపీ పార్టీలో ఉన్నన్ని రోజులు పవన్ కళ్యాణ్ గుర్తు రాలేదా? అంటూ కామెంట్ల మోత మోగిస్తున్నారు. కాగా.. అలీ.. ఏ పార్టీలో ఉన్నా కూడా.. పవన్ కళ్యాణ్‌తో నటించడం తన బెస్ట్ కాంబో అని చాలా సందర్భాల్లో చెప్పారు. అయితే ఒక్కసారి రాజకీయ బురద అంటించుకున్న తరువాత.. ఎంత కడుక్కున్నా ఇదిగో ఇలా అంటుకుంటూనే ఉంటుంది.. అది ఏ పార్టీ అయినా సరే.