ఏపీ: ఉచిత గ్యాస్ పధకంపై అప్డేట్ ఇచ్చిన సీఎం.!

FARMANULLA SHAIK
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్తను అందించారు. మంగళగిరిలో ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం సీకే కన్వెన్షన్‌లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగింది.ఈ భేటీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, పురంధేశ్వరి పాల్గొన్నారు. ఈ సమావేశంలో.. ఏపీలో ఎన్డీఏ 100 రోజుల పాలనపై చర్చించారు. అలాగే ఈనెల 20-26 వరకు ఇంటింటికీ ఎమ్మెల్యేలు కార్యక్రమం చేపట్టాలని, ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజుల పాలనను ప్రజలకు వివరించేలా కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. అలాగే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీ మేరకు.. అర్హులైన లబ్ధిదారులకు సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. దీపావళి పండుగ నుంచి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తామని.. పండుగ రోజు లబ్ది దారులకు మొదటి సిలిండర్ అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. దీంతో రాష్ట్ర ప్రజలకు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం ఇవ్వనుంది. ఒకవేళ ఎవరైనా మూడు కంటే ఎక్కువ ఉపయోగిస్తే మాత్రం ప్రభుత్వం నిర్దేశించిన ధర చెల్లించి తీసుకోవాల్సి ఉంటుంది.ఇదిలావుండగా అక్టోబరు 1 నుంచి ఏపీలో కొత్త లిక్కర్‌ పాలసీ అమలులోకి వస్తోంది. కొత్త మద్య విధానంలో కీలక నిర్ణయాలు తీసుకుంది ఏపీ కేబినెట్. కల్లు గీత కులాలకు 10 శాతం మద్యం షాపులు రిజర్వ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. బార్ల లైసెన్స్‌ ఫీజులను నాలుగు శ్లాబుల్లో నిర్ణయించారు. మద్యం ధరలను అందుబాటులోకి తెచ్చేందుకు 99 రూపాయలకు క్వార్టర్ మద్యాన్ని అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది ఏపీ కేబినెట్‌.ఈ నేపథ్యంలో కొన్ని IMFL కంపెనీలతో మాట్లాడి ఇతర రాష్ట్రాల కంటే తక్కువగా ప్రత్యేక ధరకు ఏపీలో అమ్మేలా చర్యలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నాణ్యమైన బ్రాండ్లను అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. కొత్త విధానంలో ప్రీమియర్ షాపులకు అనుమతి ఇవ్వబోతున్నారు. టెంపుల్‌ సిటీ తిరుపతిలో ప్రీమియం షాపులు ఉండవన్నారు మంత్రి పార్థసారధి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: