తిరుపతి లడ్డూ కోసం జంతు నూనె వాడారు..చంద్రబాబు హాట్ కామెంట్స్?

Veldandi Saikiran
తిరుపతి లడ్డు ప్రసాదంకి సంబంధించి చంద్రబాబు సంచలన కామెంట్ చేశారు. గత ప్రభుత్వం తిరుపతి లడ్డును అపవిత్రం చేసిందని వ్యాఖ్యానించారు. నాసిరకమైన సరుకులు వాడడమే కాకుండా.... నెయ్యికి బదులు జంతువుల కొవ్వు పదార్థాలు కూడా వాడారని సమాచారం వచ్చిందన్నారు. ఈ విషయం తెలిసి ఆందోళన చెందినట్లు వెల్లడించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్వచ్ఛమైన నెయ్యిని తీసుకువచ్చి లడ్డు ప్రసాదం కోసం వాడుతున్నామని చెప్పారు.

వరదల నేపథ్యంలో 350 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిందని.... ఇదొక చరిత్ర అంటూ చంద్రబాబు అన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఒప్పుకుంటే.... ఎన్డీఏ ఎమ్మెల్యేలు అందరం కలిసి ఒక నెల జీతం సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇద్దామంటూ సీఎం చంద్రబాబు కోరడం జరిగింది. దీనిపై ప్రపంచమంతా కూడా స్పందించిందని మనం కూడా స్పందిస్తే ఇంకా బాగుంటుందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.

టిడిపిలో సభ్యత్వం కోసం రూ. లక్ష చెల్లించిన వారికి శాశ్వత సభ్యత్వం కల్పించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఇలా ఒక లక్ష మంది సభ్యత్వాలు తీసుకుంటే వచ్చే రూ. 1000 కోట్లను కార్యకర్తల సంక్షేమానికి వినియోగించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. దీని ద్వారా దాదాపుగా రూ. 70 కోట్ల మేర వడ్డీ వస్తుందని చెప్పారు. దాదాపు 70 లక్షల మంది వరకు సభ్యత్వ నమోదు కోసం ముందుకు వస్తారని టీడీపీ అధినేత అంచనా వేస్తున్నారు.

అటు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు.... ఇసుక సహా ఎలాంటి అక్రమాల జోలికి వెళ్లొద్దని సున్నితంగా హెచ్చరించారు. 100 రోజుల పాలనపై ఈ నెల 20వ తేదీ నుంచి ఆరు రోజుల పాటు ప్రజల్లో పర్యటించాలని ఎమ్మెల్యేలకు సీఎం సూచనలు చేయడం జరిగింది. మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను దీపావళి నుంచి ఇస్తామని శాసనసభా పక్ష భేటీలో క్లారిటీ ఇచ్చిన సీఎం చంద్రబాబు...అన్ని పథకాలు అమలు చేస్తామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: