నాగార్జున, రేవంత్ రెడ్డి మధ్య 400 కోట్ల రహస్య డీలింగ్ ?
అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ను అన్యాయంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చి వేసిందని మండిపడ్డారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో... ఇదే విషయంపై రచ్చ జరుగుతోందని తెలిపారు. వాస్తవంగా తుమ్మిడి చెరువు ఎఫ్ టి ఎల్ పరిధిలో ఎన్ కన్వెన్షన్ ఉందని హైడ్రాధికారులు గుర్తించారు. అటు హిమాయత్ సాగర్ లో ఉన్న ఆనంద్ కన్వెన్షన్... ఏకంగా చెరువులోనే ఉంది.
అయితే ఈ ఎన్ కన్వెన్షన్ అలాగే ఆనంద్ కన్వెన్షన్ లతో ముందుగా రేవంత్ రెడ్డి వర్గం చర్చలు నిర్వహించిందట. చలో 400 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసిందట రేవంత్ రెడ్డి వర్గం. అయితే ఇందులో అక్కినేని నాగార్జున మాత్రం... 400 కోట్లు ఇవ్వడానికి... వెనుకాడరట. దీంతో ఎన్ కన్వెన్షన్ ను హైడ్రాధికారులు కూల్చివేసినట్లు... చెబుతున్నారు. అయితే రేవంత్ రెడ్డి సోదరులతో ఆనంద్ కన్వెన్షన్ వర్గం చర్చలు.. నిర్వహించి డబ్బులు ఇచ్చిందట.
అందుకే హిమాయత్ సాగర్ లో ఉన్న.. ఆనంద్ కన్వెన్షన్ కూల్చి వేయలేదని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు. అక్కినేని నాగార్జున డబ్బులు ఇవ్వకపోవడంతోనే రేవంత్ రెడ్డి... ఇలా చేశాడని అంటున్నారు. దమ్ముంటే చెరువులో ఉన్న అన్ని అక్రమ కట్టడాలను రేవంత్ రెడ్డి కూల్చివేయాలని ఫైర్ అయ్యారు బాల్క సుమన్. అన్యాయంగా పేదల ఇండ్లను కూల్చుతున్నారని మండిపడ్డారు. ఇది ఇలా ఉండగా నెల రోజుల కిందట అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు ధ్వంసం చేయడం జరిగింది.