జగన్ భవిష్యత్ లో ఎదుర్కోనున్న సవాళ్లు అవే.. ఇక పార్టీ నడపడం కష్టమే..?

murali krishna
* వైసీపీకి మొదలైన అసలు కష్టాలు.
* పార్టీని వీడుతున్న బలమైన నాయకులు
* జగన్ ముందు భారీ సవాళ్ళు..అన్నీ దాటి పార్టీని నడపగలరా
* చెల్లి వల్ల ముంచుకొస్తున్న ముప్పు..పార్టీ ఉనికికే ప్రమాదంగా మారిందిగా..

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత కాంగ్రెస్ నీ వీడి సొంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు.. వైఎస్ఆర్ మీద వున్న గౌరవంతో జగన్ కు అండగా ఉండటం కోసం కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులు అంతా కూడా ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి వైసీపీ లో జాయిన్ అయ్యారు.. 2011 లో స్థాపించిన జగన్ పార్టీ జోరు చూపించింది.. 2012 ఉప ఎన్నికల్లో ఏకంగా 15 స్థానాలు గెలుచుకొని బలమైన ప్రతి పక్షంగా తాము ఉన్నామని నిరూపించుకుంది.. ఆ తరువాత రాష్ట్ర విభజన జరగటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి కోల్పోవడం వైసీపీకి బాగా కలిసి వచ్చింది.. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయ్యాడు..దానితో ఆ సమయంలో ఆ పార్టీకి జగన్ చెల్లెలు షర్మిల అండగానిలిచింది.. దాదాపు 16 నెలలు జైలు శిక్ష తరువాత జగన్ జైలు నుంచి విడుదల అయ్యారు.. ఆ సమయంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ 60 కు పైగా స్థానాలు సాధించి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది..ఆ తరువాత అనూహ్య పాదయాత్రతో జగన్ 2019 ఎన్నికల్లో  151 సీట్లు సాధించి చరిత్ర సృష్టించారు.. ముఖ్యమంత్రిగా భాద్యతలు స్వీకరించిన జగన్ సంక్షేమ పధకాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేసారు..

వాలంటీర్, సచివాలయ వ్యవస్థ ద్వారా జగన్ సంక్షేమ పధకాలను పంపిణీ చేసారు.. అయితే ఉచిత పధకాలను అందించే ప్రయత్నంలో జగన్ అసలు అడ్మినిస్ట్రేషన్ గాలికొదిలేసారు.. రాష్ట్రములో నిరుద్యోగులు ఎక్కువయ్యారు…ఉద్యోగాల కోసం  నిరుద్యోగులు  పక్క రాష్ట్రానికి వలస వెళ్లారు.. సీఎంగా వున్నప్పుడు జగన్ ఒక్క బహిరంగ ప్రెస్ మీట్ కూడా పెట్టింది లేదు.. తమని తమ పార్టీ నేతలను హింసించిన టీడీపీ పై వున్న కక్ష మొత్తం తీర్చుకున్నారు.. జగన్ పూర్తిగా విజయ్ సాయిరెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి వంటి వారికే ప్రాధాన్యత ఇచ్చారు.. ఒక్కోసారి సొంత పార్టీ ఎమ్మెల్యేలకే జగన్ అపాయింట్ మెంట్ దొరకని పరిస్థితి ఏర్పడింది. దీనితో జగన్ 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు.మరీ 11 సీట్లు మాత్రమే సాధించి జగన్ ప్రతిపక్ష హోదా కోల్పోయారు.. కూటమి ప్రభుత్వం వచ్చాక జగన్ కి కష్టాలు మరింత ఎక్కువయ్యాయి..

 జగన్ అధికారంలో వున్నప్పుడు చేసిన తప్పులను ఒక్కొక్కటిగా వెలికి తీస్తున్నారు.. వైజాగ్ ఋషి కొండ మీద అద్భుతమైన ప్యాలెస్, అలాగే ఎగ్ ఫఫ్ ల కోసం కోట్ల రూపాయల ఖర్చు, అలాగే తన సొంత మీడియా అయినా సాక్షి సర్క్యూలేషన్ కు ఏకంగా 300 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా జగన్ పై ఆరోపణలు వచ్చాయి.. అంతే కాదు జగన్ ఒడిపోవడానికి అసలు కారణం తన సొంత బాబాయ్ హత్య కేసును పట్టించుకోకపోవడమే.. దీనితో ఇద్దరు చెల్లెళ్ళు ఎదురు తిరిగి జగన్ పై విమర్శనాస్త్రాలు కురిపించారు.. కూటమి ప్రభుత్వం మళ్ళీ ఆ కేసుపై పూర్తి విచారణ జరిపించనుంది. ఒక వేళ ఆ కేసులో జగన్ హస్తం ఉన్నట్లు తెలిస్తే జైలుకు వెళ్లడం ఖాయం.. దీనితో వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: