టార్గెట్ 2029: జగన్ రాజకీయ భవిష్యత్తు..కూటమి చేతుల్లోనే ఉందా..?

FARMANULLA SHAIK
* 2019 ఫలితాల్లో వైసీపీ భారీ విజయం.!
* 2024 ఎన్నికల ముందు వైసీపీపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.!
* జగన్ చేసిన ఆ తప్పులే .. కూటమికి ఒక పాఠం.!
* కూటమిలో కల్లోలం రాకుండా జాగ్రత్త పడితేనే.?

(ఏపీ-ఇండియాహెరాల్డ్): ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ నాయకత్వంలోని వైసీపీ ఘోర ఓటమిని చవిచూసింది.రాష్ట్రంలో ఎవరూ ఊహించని విధంగా ఫలితాల్ని అందుకున్న వైసీపీ 175 స్థానాలకు గాను11సీట్లు సాధించి ఒక్కసారిగా చతికిల పడిపోయింది.దీంతో ఇక వైసీపీ పని అయిపోయింది ఆ పార్టీ మళ్లీ పైకి లేవడం కష్టం అని జగన్ రాజకీయ ప్రత్యర్థులు అనుకున్నట్టుగా సోషల్ మీడియా కోడై కూస్తుంది.అటు వైసీపీ నేతలు, కేడర్ కూడా డీలాపడిపోయి దాన్ని నిజం చేస్తూ వైసీపీ నేతలు కూడా వరుసగా పార్టీను వీడుతున్నారు. జగన్ కూడా డైలామాలో ఉన్నట్టు అనేక వార్తలు,విశ్లేషణలు వినిపిస్తున్నాయి కానీ జగన్ మాత్రం దానికి భిన్నంగా మేకపోతు గంభీర్యాన్ని చూపిస్తున్నట్లు తెలుస్తుంది.
పదేళ్ల క్రితం రాజకీయాలు ఒకరకం ఐతే ప్రస్తుత రాజకీయాలు మరోరకంలాగా ఉన్నాయి. 2014లో అధికారం చేపట్టిన టీడీపీ అయిదేళ్ల పాలనలో ప్రజలను పెద్దగా ఇబ్బంది కలగకపోయినా జగన్ అధికారం కోసం అప్పటికే పడ్డ పదేళ్ల శ్రమ ఒకవైపు,దివంగత నేత వైయస్సార్ తనయుడిగా గుర్తింపు మరోవైపు అలాగే 2019 ఎన్నికల ముందు జగన్ చేసిన పాదయాత్ర అన్నీ కలిసోచ్చి జగన్ కూ భారీగా ప్రజా మద్దతు ఓట్ల రూపంలో లభించింది. అప్పటి ఎన్నికల్లో 151 సీట్లు సాధించి రికార్డ్ సృష్టించారు.

అయితే అలాంటి విజయాన్ని జగన్కూ ప్రజలు కల్పిస్తే మొదటి మూడేళ్ళ వరకు ప్రజల్లో మంచి నమ్మకాన్ని,విశ్వాసాన్ని చోరగొన్న వైసీపీ ప్రభుత్వం చివరి రెండేళ్లలో కొన్ని వర్గాల్లో అధికార దాహంతో నియంత పరిపాలన చూపించారు.జగన్ ప్రతిదాన్ని కూడా సంక్షేమ పధకాల పేరుతొ డబ్బులు ఖర్చు చేసి రాష్ట్ర అభివృద్ధి కుంటు పడేసేలా చేశారు. అదే ప్రతిపక్షనికి ఆయుధంలాగా మారింది. మరీ ముఖ్యంగా జగన్ సీఎంగా ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కొందరు రాజకీయా నేతలకు సైతం ఇబ్బంది కల్పించిందని నేతలే ఒకానొక సందర్భంలో అన్నారు. ఒక్క సారికూడా జగన్ సీఎం అయ్యాక ప్రజలతో వారి కష్టాల గూర్చి మాట్లాడింది లేదు.దానికి తోడు ముఖ్యంగా పరదలా సీఎంగా పేరూపొందారు.మరీ ముఖ్యంగా 2024 ఎన్నికల ముందు వైసీపీ గుడ్డిగా గెలుపు తమదేనని వ్యవహరించి ఒకవైపు నిరుద్యోగులను, ఉద్యోగులను,అంగన్వాడీలను, మునిసిపల్శాఖా ఉద్యోగులను.... ఇలా ఒక్కొక్కరిని తీవ్ర ఇబ్బందికి గురిచేయడం వల్ల ఒక్కసారిగా ప్రజల్లో కలిగిన అగ్రహానికి పరాకాష్టగా 2024 ఎన్నికలు నిదర్శనం.ఒకప్పుడు సోషల్ మీడియా అనేది అప్డేట్ కాలేదు కాబట్టి విషయం ప్రజానీకానికి చేరడానికి బాగా సమయం పట్టేది. కానీ ప్రస్తుతం నిమిషాల్లో మనం చేసే పని ప్రజలు బాగా దగ్గరనుండి చూస్తున్నారని నేతలు గ్రహించాలి.

అయితే ప్రస్తుతం వైసీపీ రాజకీయ భవిష్యత్తు అనేది అధికారంలోకి వచ్చిన కూటమి నేతల పైనే ఉందన్న సంగతి తెల్సుకోవాలి. కూటమిపై నమ్మకంతో ప్రజలు 164 స్థానాల్లో నేతల్ని గెలిపించుకున్నారు.అయితే కూటమి సంక్షేమ పధకాలపై ఫోకస్ తగ్గించిన అభివృద్ధిపై దృష్టి పెడితే మాత్రం ప్రజలు దాన్ని ఆహ్వానిస్తారన్నా సంగతి తెల్సిందే. అలాగే ఎన్నికల హామీల్లో భాగంగా డియస్సీ నిర్వహణ,ఉద్యోగుల డిమాండ్లు సానుకూలంగా స్పందించి వారందరిని కలుపుకు పొతే రానున్న ఎన్నికల్లో కూటమి ఒన్స్మోర్ అనేలా ప్రజాతీర్పు ఉంటుందనే చెప్పాలి. అయితే జగన్ ను రాజకియ భవిష్యత్తు దెబ్బతీయాలంటే మాత్రం కూటమిలో కల్లోలం రాకుండా సానుకూలంగా మూడు పార్టీలు కూడా వ్యవహారించాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు మూడు పార్టీల క్యాడర్ ను దిశా నిర్దేశం చేస్తున్నారు.2019 ఎన్నికలకు ముందు జగన్‌ను చంద్రబాబు లైట్‌గా తీసుకున్నారు. దాని ఫలితం 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించింది.ఇప్పుడు కూడా కూటమికి భారీ విజయం దక్కడంతో జగన్‌ను లైట్‌గా తీసుకోవడం మానేసి ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై ఎలాంటి అవగాహన ఉందొ ఎప్పటికప్పుడు తెల్సుకుంటా తమ లోపాలను సరిదిద్దుకంటూ పోతుంటే మాత్రం వచ్చే ఎన్నికల్లో కూడా కూటమికి ప్రజలు బ్రహ్మరధం పట్టడం ఖాయమని తెలుస్తుంది.ఏమాత్రం అవకాశం కూడా జగన్ కూ కూటమి నేతలు ఇవ్వకుంటేనే ప్రజల విశ్వాసం మరల పొందగలరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: