జగన్ ముందున్న సవాళ్లు ఇవే.. 2029 దాకా రాజకీయాల్లో ఉంటారా..?

frame జగన్ ముందున్న సవాళ్లు ఇవే.. 2029 దాకా రాజకీయాల్లో ఉంటారా..?

praveen

• వైసీపీ పార్టీ నేతలే జగన్ కి హాండ్ ఇస్తున్నారు
• ఎంతో నమ్మకం పెట్టుకున్న పార్టీని వీడుతున్న వేళ జగన్‌కు భయం.
• జగన్ 2029 ఎన్నికలకు ముందు ఎన్నికల్లో ఎదురుకునే సవాళ్లు ఏవంటే
దివంగత నేత వైఎస్ఆర్ విమానా ప్రమాదంలో చనిపోయి ఏపీ ప్రజలను శోక సంద్ర లో ముంచేత్తారు. అలాంటి నేత ఇప్పటిదాకా ఏపీ రాష్ట్రంలో లేరని చెప్పాలి. ఆయన కుమారుడు జగన్ 2012లో వైసీపీ పార్టీని స్థాపించారు. అప్పట్లో చాలా మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి వైసీపీలో జాయిన్ అయ్యారు. 2012 ఉపఎన్నికల్లో ఏకంగా 15 సీట్లు గెలుచుకుని వైసీపీ టిడిపికి పోటీ ఇవ్వడం మొదలుపెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ఉనికిని పూర్తిగా కోల్పోతూ వచ్చింది అది జగన్ కు ప్లస్ అయింది. కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండగానే జగన్‌ అక్రమ ఆస్తుల కేసులో జైలు పాలయ్యారు.
జగన్ చెల్లెలు షర్మిల వైసీపీ పార్టీని మేనేజ్ చేశారు.  దాదాపు 16 నెలల జైల్లో జగన్ ఉంటే షర్మిల ప్రచారం చేస్తూ వైసీపీకి మంచి బూస్ట్ తెచ్చారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ 60కి పైగా సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఎదిగింది. 2019 ఎన్నికల్లో జగన్ 151 సీట్లు సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటినుంచి ఈ నవరత్నాల పేరిట సంక్షేమ పథకాలతో ప్రజలను చాలా లబ్ధి చేకూర్చారు.
వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ఆయా పథకాల ద్వారా డబ్బులను ఇంటికి డిస్ట్రిబ్యూట్ చేశారు. కానీ ఉచిత పథకాలు అందించే ప్రయత్నంలో జగన్ అభివృద్ధిని పూర్తిగా పెడ చెవిని పెట్టారు. ఆల్కహాల్ విషయంలో కూడా ఆయన తప్పటి అడుగులు వేశారు. ఎలాంటి సంస్థలను ఏపీకి తీసుకురాలేదు. కరెంట్ బిల్లులు పెంచారు చెత్త పన్ను అన్నారు. యువత ఉద్యోగాల కోసం ఏపీని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఒక్క ప్రెస్ మీట్ కూడా నిర్వహించలేదు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను సైతం కలవలేదు. సింగల్ సింహం గా పోటీ చేస్తా అని గర్వంగా పోయారు. చివరికి 2024 ఎన్నికల్లో కేవలం 11 స్థానాల్లో అతి కష్టం మీద గెలిచి పతనమయ్యారు. కూటమి ప్రభుత్వం వచ్చాక జగన్ కష్టాలు మళ్ళీ పున ప్రారంభమయ్యాయి.
అధికారంలో ఉన్నప్పుడు జగన్ చేసిన తప్పులను వెలుగులోకి తెస్తూ ఆయన్ను మరింత ఇరకాటంలో   పడేస్తున్నారు. వైజాగ్‌లోని రిషి కొండపై ప్యాలెస్‌ కట్టే వందల కోట్లు వేస్ట్ చేశారని కేసులు జగన్ పై ఉన్నాయి. ఇక ఎగ్‌ పఫ్‌లకు కూడా కోట్ల రూపాయల ధనం వృధా అయిపోయిందని ఆరోపణలు వస్తున్నాయి. సాక్షి సర్క్యులేషన్‌కు రూ.300 కోట్లు ఖర్చు చేశారట.
సొంత బాబాయ్ హత్య కేసును జగన్ సాల్వ్ చేయలేకపోయారు. షర్మిల విషయంలో కూడా ఆయన సరిగా నడుచుకోలేదని సమాచారం అందుకే బాబాయ్ కూతురితో పాటు సొంత చెల్లి కూడా ఆయనకు వ్యతిరేకమయ్యారు. వాళ్లు ఇప్పటిలో కలిసేలాగా కనిపించడం లేదు వారిద్దరు ఈయనకి ఒక పెద్ద సవాలు అని చెప్పుకోవచ్చు. పైగా జగన్ చాలా కేసుల్లో ఇరుక్కుపోయారు. ఆయన అక్రమాలకు ఒక్కోటిగా బయటకు వస్తున్నాయి. టీడీపీ కూటమి చాలా బలంగా ఉంటుంది కాబట్టి దాన్ని జగన్ ఢీకొట్టే అవకాశం లేదు సొంత పార్టీ వాళ్లు కూడా పోతున్నారు కాబట్టి ఆయన బలహీనమవుతున్నారు. ఇలా ఎక్కువగా బలహీనమైతే ఆయన రాజకీయాల్లో ఉంటారా లేదంటే వెళ్ళిపోతారా? అనేది కూడా ప్రస్తుతానికి సస్పెన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: