జమిలీ ఎన్నికలు..ఇక ఆ పార్టీలు షెడ్డుకే...మోడీ ప్లాన్‌ ఇదే ?

Veldandi Saikiran
కేంద్రంలో మోడీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా.. ఒకే ఎన్నిక నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. ఒకే దేశం ఒకే ఎన్నిక అనే నినాదంతో బిజెపి మొదటినుంచి ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే.  అయితే గత పది సంవత్సరాలలో కూడా ఈ జమిలీ ఎన్నికల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి మోడీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కానీ ఇప్పుడు మాత్రం 100 అడుగులు ముందుకు వేసింది మోడీ సర్కార్.

ఏ క్షణమైనా జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈసారి కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి సరిగ్గా సీట్లు రాలేదు. నితీష్ కుమార్ అలాగే నారా చంద్రబాబు నాయుడు సపోర్ట్ లేకపోతే అసలు మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చేదే కాదు. చంద్రబాబు అలాగే నితీష్ కుమార్ కారణంగానే... దేశంలో మోడీ ప్రభుత్వం ఏర్పాటు అయిందని అందరికీ తెలుసు.

అయితే ఎప్పటిలాగే మళ్లీ ఎన్నికలు జరిగితే బిజెపి దారుణంగా  ఓడిపోవడం గ్యారంటీ అని అంటున్నాయి సర్వేలు. అందుకే 2029 కంటే ముందే జెమిలి ఎన్నికలు నిర్వహించేందుకు.. పక్క ప్లాన్ చేస్తోంది మోడీ ప్రభుత్వం. ప్రాథమిక సమాచారం ప్రకారం 2026 వరకు జమిలీ ఎన్నికలు రానున్నట్లు సమాచారం. అయితే ఈ జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే ప్రాంతీయ పార్టీల మనుగడ.. కనుమరుగు కావడం గ్యారెంటీ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

జమిలీ ఎన్నికలు  నిర్వహించడం వల్ల భారత రాష్ట్ర సమితి, వైసిపి, తెలుగుదేశం పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడులోని డీఎంకే అలాగే అన్నాడీఎంకే, జెడియు, ఎన్సిపి  ఇలా చెప్పుకుంటూ పోతే దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ కనుమరుగు కావడం ఖాయం అంటున్నారు. జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే దేశవ్యాప్తంగా... జాతీయ పార్టీలే హాట్ టాపిక్ అవుతాయని.. దానివల్ల ప్రాంతీయ పార్టీలకు నష్టం జరుగుతుందని చెబుతున్నారు. అలాగే రాష్ట్రాల సమస్యలు కూడా... తెరపైకి రాకుండా.. కేవలం జాతీయ సమస్యలే తెరపైకి వస్తాయని చెబుతున్నారు. కాబట్టి.. జమ్లి ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలకే కాకుండా.. రాష్ట్రాలకు కూడా నష్టమే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: