హెరిటేజ్: రేవంత్, చంద్రబాబు మధ్య రూ.204 కోట్ల డీలింగ్ ?
అయితే వీరిద్దరి మధ్య రహస్యంగా జరిగింది కాదని సమాచారం. చంద్రబాబు నాయుడుకు హెరిటేజ్ కంపెనీ ఉన్న సంగతి తెలిసిందే. ఆ ఆస్తులన్నీ చంద్రబాబు నాయుడు కుటుంబం పేరుపైన ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో 204 కోట్లతో హెరిటేజ్ భారీ పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయిందట.హైదరాబాదులో పెట్టుబడులు పెట్టాలని ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆహ్వానించారట.
దీంతో నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ డీలింగుకు ఒప్పుకున్నారట. దీంతో షామీర్పేటలో భారీ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు హెరిటేజ్ ఫుడ్స్ నిర్ణయం తీసుకుందట. ఈ కంపెనీ కోసం భారీగా.. రాయితీలు ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమైనట్లు సమాచారం. వాస్తవంగా కెసిఆర్ అధికారంలో ఉన్నప్పుడు హెరిటేజ్ కంపెనీలకు ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వలేదు. అది చంద్రబాబు నాయుడు కంపెనీ కావడం తో కాస్త వెనుకడుగు వేశారు కేసీఆర్. అప్పట్లో కేరళలో హెరిటేజ్ పైన బ్యాన్ విధించాలని సాకు చెందుతూ.. తెలంగాణకు రానివ్వలేదు కేసీఆర్. కానీ ఇప్పుడు హెరిటేజ్ కంపెనీకి దారులు తెరుసుకున్నాయి.