ఆదాయమున్న వనరులు సున్నా.. వర్షాలు వస్తే ఘాట్ రోడ్ గజగజ.!

Pandrala Sravanthi
- ఘన చరిత్ర కలిగిన ఘాట్ రోడ్
- వర్షం వస్తే చిత్తడి చిత్తడే.
- ఘాట్ రోడ్ సమస్య తీరేదేప్పుడో.?

 తిరుమల తిరుపతి  దేశంలోనే ఎంతో పవిత్రమైనటువంటి  దేవాలయం అని చెప్పవచ్చు. అలాంటి తిరుపతి దేవస్థానం  ఆంధ్రప్రదేశ్ కు ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా మారింది. రోజు కోట్లాది రూపాయలు భక్తులు కానుకగా సమర్పిస్తారు. ఎన్నో కోట్ల ఆదాయం మస్తున్నా కానీ దేవస్థానంలో  ప్రజలకు కనీస వనరులు కూడా కల్పించడం లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు  అధికారులు ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి తిరుపతిలో ఘాట్ రోడ్డు అనేది మరింత దారుణంగా తయారయింది. కొద్దిపాటి వర్షం పడిన ఘాట్ రోడ్ పరిస్థితి చెప్పలేం. ఎన్నో ప్రమాదాలకు నిలయంగా మారిన ఘాట్ రోడ్ గురించి ఎవరికీ తెలియని విషయాలు ఇప్పుడు చూద్దాం..
 వర్షం వస్తే ఘాట్ రోడ్ గజగజ:
 ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఘాట్ రోడ్లు ఉన్నాయి కానీ ఇందులో తిరుమల శ్రీవారి ఘాట్ రోడ్ చాలా ప్రత్యేకత సంతరించుకుంది. అలాంటి ఘాట్  రోడ్ లో అడుగడుగున ఆధ్యాత్మికత దర్శనమిస్తుంది. ఎత్తయిన కొండల మధ్య వంకలు తిరిగే రోడ్డు  మనకు దర్శనం ఇస్తాయి. తిరుమల తిరుపతిని దర్శించుకోవడానికి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం వారు వేసినటువంటి అద్భుతమైన మార్గం ఇది. దేశానికి స్వాతంత్రం రాకముందే ఈ ఘాట్ రోడ్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మొత్తం 22 కిలోమీటర్లు ఉన్నటువంటి ఘాట్ రోడ్డు  ప్రస్తుతం ప్రమాదాలకు నిలయంగా మారింది. ఈ ఘాట్ రోడ్డు ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అంతేకాదు చిన్నపాటి వర్షం పడినా, ఈదురు గాలులు వచ్చిన ఘాట్ రోడ్డు ప్రయాణం చేయాలంటే వణికి పోవాల్సిందే.

 కొండల మీద నుంచి  నీరంతా వచ్చి ఘాట్ రోడ్ పైకి చేరి  ప్రయాణానికి ఆటంకాలు కలిగిస్తూ ఉంటుంది. ఆ విధంగా ఎంతో అభివృద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ  ఘాట్ రోడ్ విషయంలో మాత్రం తాత్సారం వహిస్తోంది. ఎన్నో ఆదాయ వనరులు వస్తున్నా కానీ ఘాట్ రోడ్ సెట్ చేయడంలో మాత్రం విఫలమవుతున్నారని చెప్పవచ్చు. చిన్నపాటి వర్షం వస్తే చాలు ఘాట్ రోడ్డుపై వరదలు పారుతాయి. చెట్లు విరిగిపోయి రోడ్డు పైనే పడతాయి. ఈ వర్షాల కారణంగా ఘాట్ రోడ్డు ప్రయాణాలే పూర్తిగా నిలిపివేస్తారు. ప్రధాన సమస్యగా ఘాట్ రోడ్ ఉందని చెప్పవచ్చు. ఈ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఘాట్ రోడ్ బ్రిటిష్ వారి కాలంలో వేసింది తప్ప  ఇప్పటికి దానికి కొత్త ప్లానింగ్ అనేది రాలేదని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: