తిరుమల లడ్డూల వివాదంపై రంగంలోకి పవన్‌..జగన్‌ ను ఇరికించేలా భారీ ప్లాన్‌ ?

Veldandi Saikiran
గత రెండు రోజులుగా తిరుమల శ్రీవారి లడ్డూల వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు ఈ రచ్చను తెరపైకి తీసుకురావడంతో...ఇప్పుడు తార స్థాయికి చేరింది ఈ వివాదం. అయితే.. ఈ తరుణంలోనే... తిరుమల లడ్డూల వివాదంపై జనసేన పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

తిరుమల లడ్డూల తయారీలో కల్తీ నెయ్యిని వాడుతున్నట్టు తెలిసిందని తెలిపారు జనసేన పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌.
ఈ విషయం తెలిసి బాగా తసత చెందానని పేర్కొన్నారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత జగన్‌ ప్రభుత్వంలోని టీటీడీ బోర్డు దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు జనసేన పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌.
జాతీయ స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆలయాలకు సంబంధించిన అంశాల పరిశీలనకు జాతీయ స్థాయిలో ఓ విధానం రూపొందించాలని తెలిపారు.  మఠాధిపతులు.. పీఠాధిపతులతో చర్చించాలని... ఆలయాల రక్షణపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరారు జనసేన పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌.
ఇది ఇలా ఉండగా, తిరుమల లడ్డులో జంతువుల కొవ్వుతో పాటు అభ్యంతరకర పదార్థాలు ఉన్నాయంటూ ల్యాబ్ రిపోర్ట్ తాజాగా ప్రకటన ఇచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డు నాణ్యత పైన చాలా రకాల విమర్శలు వచ్చాయి. గతంలో ఉన్నట్టుగా నాణ్యత గానీ, రుచి గానీ, సువాసన గానీ లేదంటూ ఆరోపణలు మొదలయ్యాయి. హిందూ ధర్మ ప్రచారకుడు రాధా మనోహర్ దాస్ తొలిసారి సామాజిక మాధ్యమాల్లో లడ్డు నాణ్యతను ప్రశ్నించడం జరిగింది. లడ్డూ సహా అన్నప్రసాదాల నాణ్యత తగ్గడానికి ప్రధాన కారణం నాణ్యతలేని నెయ్యి అని ప్రస్తుతం ఈవో దృష్టికి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: