ముందస్తు ఎన్నికలు కావాలని వైసీపీ అడుగుతోందా?

frame ముందస్తు ఎన్నికలు కావాలని వైసీపీ అడుగుతోందా?

Suma Kallamadi
ముందస్తు ఎన్నికలు కావాలని వైసీపీ అనుకుంటోందా అంటే? అవుననే గుసగుసలు వినబడుతున్నాయి. అవును, ముందస్తు ఎన్నికలు రాకూడదు అని అధికార పక్షం కురుకుంటుంటే, ముందస్తు ఎన్నికలు రావాలని ప్రతిపక్షం ఆశిస్తున్నట్టు కనబడుతోంది. అయితే దీనికి జవాబు వెరీ సింపుల్. ఎన్నికలు జరిగితే మళ్లీ చాన్స్ వస్తుందని వైసీపీ ఆశపడుతోంది. గడచిన అయిదేళ్ళ వైసీపీ పాలనలో తెలుగుదేశం కూడా దాదాపుగా ఇలాగే జరగాలని కోరుకొనేది. అప్పట్లో వైసీపీ అధికారం చేపట్టిన 6 నెలల నుంచే ఈ రాగం తీసేది వైసీపీ. ఆ తరువాత మధ్యంతరం అని కొన్నాళ్ళు ప్రచారం చేసినా అది అంత తేలిక కాదనే విషయం అందరికీ విదితమే.
అదేవిధంగా తెలంగాణా ఎన్నికలతో ముడి పెట్టి గత ఏడాది వైసీపీ ముందస్తుకు వెళ్తుంది అని కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగాయి. ఇక్కడ టీడీపీ ప్రచారం తప్పు కాదు, ఎందుకంటే అది రాజకీయ వ్యూహం. ఇప్పుడు కూడా వైసీపీ టీడీపీ పాటే పడుతున్నట్టు కనబడుతోంది. ఇక జమిలి ఎన్నికల ప్రచారం గురించి గుర్తే ఉంటుంది. ఏకంగా కేంద్రం జమిలి ఎన్నికల మీద మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ చేసిన సిఫార్సులను ఆమోదించింది. ఈ పరిణామాలను చూసినపుడు జమిలి ఎన్నికల విషయంలో బీజేపీకి ఉన్న పట్టుదల అందరికీ అర్ధం కాకతప్పదు. అందు వలన జమిలి ఎన్నికల విషయంలో బీజేపీ ఎక్కడా తగ్గదనే అంటున్నారు. దీంతో వస్తే ముందస్తు లేకపోతే మధ్యంతరం దేశంలో ఖాయం అని అంతా అనుకుంటున్న పరిస్థితి.
అయితే ఈ రెండింటిలో ఏది వచ్చినా తమకే లాభమని వైసీపీ లెక్కలు వేసుకుంటోంది. ముందుగా ఎన్నికలు వస్తే మరో లక్కీ చాన్స్ దక్కి తమకే పగ్గాలు అందుతాయని కలలు కంటోంది వైసీపీ. అయితే వైసీపీ అధికారికంగా బయటకు చెప్పకపోయినప్పటికీ ప్రతిపక్షంగా జమిలి ఎన్నికలు వస్తే వైసీపీకే లాభమని ప్రచారం జోరుగా సాగుతోంది. దాంతో వైసీపీ ముందస్తుకు తథాస్తు పాలకొచ్చని అంటున్నారు. మరో వైపు పార్టీ నుంచి నేతలు వెళ్ళిపోతున్న క్రమంలో పార్టీని పటిష్టం చేసుకోవడం, ఉన్న నేతలకే టికెట్లు అని పార్టీ చెప్పుకునేందుకు వీలు కలుగుతోంది అని కూడా అంటున్నారు. చూడాలి మరి జమిలి ఎన్నికల మీద వైసీపీ ఏ విధంగా అఫీషియల్ గా రియాక్ట్ అవుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: