వైసిపి పార్టీ రాజీనామా పై సడన్ ట్విస్ట్ ఇచ్చిన కేతిరెడ్డి..!

Divya
2024 ఎన్నికలలో వైసిపి పార్టీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత చాలామంది నేతలు కార్యకర్తలు వైసిపి పార్టీని వీడి ఇతర పార్టీల వైపు వెళుతున్నట్లు వార్తలు వినిపించాయి .అన్నట్టుగానే కొంతమంది నేతలు కూటమి ప్రభుత్వం వైపుగా అడుగులు వేశారు. నిన్నటి రోజున మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా వైసిపికి గుడ్ బై చెప్పిన జనసేన పార్టీలోకి చేరడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే మరొక మాజీ ఎమ్మెల్యే ఉదయభాను కూడా జనసేన పార్టీలోకి చేరేందుకు సిద్ధమయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మరి కొంతమంది పేర్లు కూడా వినిపించాయి.

అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కూడా వైసీపీకి రాజీనామా చేసి పార్టీ మారుతున్నారని విషయం వైరల్ గా మారింది. ఈ విషయం పైన కేతిరెడ్డి స్పందిస్తూ.. తాను పార్టీ మారడం లేదని క్లారిటీ ఇచ్చారు. 35 ఏళ్లగా తాను వైసిపి కుటుంబంతోనే ఉన్నానని ఇకపై కూడా ఆ కుటుంబంతోనే కలిసి అడుగులు వేస్తానంటూ తెలియజేశారు. తాను రాజకీయాలలో ఉన్నంతవరకు వైసీపీ పార్టీ వైపే ఉంటానని జగన్ గారి వెంటే నడుస్తానంటూ తెలిపారు.

ఎల్లవేళలా కూడా జగన్ కుటుంబానికి తోడుగానే నిలుస్తానని వైయస్ కుటుంబం సభ్యులే బయటికి వెళ్లారు కానీ మా ప్రయాణం మాత్రం ఎప్పటికీ జగనన్నతోనే అంటూ తెలిపారు.. తాను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు నన్ను నమ్ముకున్న వారి కోసమే రాజకీయాలలోకి వచ్చాను అంటూ తెలియజేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. వైసిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే ప్రోగ్రాం తో ప్రతిరోజు ప్రజలలో మమేకమైన కూడా 2024 ఎన్నికలలో ప్రజలు ఓడించడంతో తాను ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు.. అందుకే కొద్ది రోజులు బయట ఎక్కడా కనిపించలేదు..అయినా కూడా మళ్లీ గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ ని మొదలు పెడతానని తెలియజేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: