వైవీ సుబ్బారెడ్డి వర్సెస్ లోకేశ్... హీటెక్కిన లడ్డు రాజకీయం?

Suma Kallamadi
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ వ్యవహారం అనేది ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. ఎప్పుడైతే సీఎం చంద్రబాబు గత వైసీపీ ప్రభుత్వం హయాంలో తిరుపతి దేవస్థానం లడ్డూ అపవిత్రం అయిపోయిందని, ప్రసాదం తయారీకి వినియోగించే ఆవునెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ ఆరోపణలు చేసారో, ఇక అప్పటినుండి.. టీడీపీ వర్సెస్ వైసీపీ అన్న మాదిరి మాటలు తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ నేత.. రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా స్పందించడం జరిగింది. గత ప్రభుత్వంలో టీటీడీలో చక్రం తిప్పిన ఈ కేండిడేట్.. తాజా ఆరోపణలపై విరుచుకు పడటం విడ్డురమే.
ఈ నేపథ్యంలోనే ఆరోపణలు చేసిన చంద్రబాబుకు తీవ్రమైన సవాలు విసిరారు ఈ రెడ్డిగారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చాలా దుర్మార్గంగా ఉన్నాయని, రాజకీయ లబ్ధికోసం చంద్రబాబు ఎంతటి నీచానికైనా దిగజారుతాడని దుయ్యబట్టారు. అంతేకాకుండా, బాబు నిజమని తేలితే... తిరుపతి వెళ్లకుండానే గుండు కొట్టించుకుంటానని సవాల్ విసిరారు. తిరుమల ప్రసాదంపై ఎలాంటి అవకతవకలు జరగలేదని, ఆ దేవుడి సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నాం.. అని కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు.. నారా లోకేశ్ లు తమ కుటుంబ సభ్యులతో వచ్చి ప్రమాణానికి సిద్ధమా? అంటూ ప్రశ్నించారు.
ఇక ఇదే అంశంపై భూమన కరుణాకర్ రెడ్డి కూడా తీవ్రంగా స్పందించినట్టు సమాచారం. హిందూ వ్యతిరేకులు మాట్లాడాల్సిన మాటల్ని చంద్రబాబు మాట్లాడారని, హిందువుల మనోభావాల్ని చంద్రబాబు కించపరుస్తున్నారు అని దుమ్మెత్తిపోశారు. ఇక ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి, బాబు వ్యాఖ్యలను ఉద్దేశించి పాజిటివ్ గా ఇచ్చిన రిపోర్టుని ఉద్దేశిస్తూ... కరీముల్లాతో చంద్రబాబుకి మంచి స్నేహం ఉంది. తనకు కావాల్సినట్లుగా రిపోర్టు రాయించుకున్నారు అని తప్పుబట్టారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ‘‘జంతువుల కొవ్వుతో లడ్డూ తయారు చేసిన వారంతా సర్వనాశనం అవుతారు. లేదంటే ఆరోపణలు చేసిన వ్యక్తే సర్వనాశనం అవుతారు!’’ అంటూ శపించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: