రేవంత్ విషయంలో బిఆర్ఎస్ కు షాక్ ఇచ్చిన సుప్రీం..!

FARMANULLA SHAIK
ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి బదిలీ చేయాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీష్‌ రెడ్డి సుప్రీం కోర్టులో ట్రాన్స్‌ఫర్‌ పిటిషన్‌‌ను దాఖలు చేశారు. ఈ మేరకు ఆ పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్  ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కేసులో రేవంత్‌రెడ్డి విచారణను ప్రభావితం చేస్తారనే విషయం అపోహ మాత్రమేనని అభిప్రాయ పడింది. ఈ విషయంలో ఊహాజనిత జగదీష్‌రెడ్డి పిటిషన్‌ను ఎంటర్‌టైన్ చేయలేమని, స్పష్టమైన ఆధారాలు లేకుండా పిటిషన్ దాఖలు చేశారని తెలిపింది. కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు కోర్టు నిరాకరిచింది.అదేవిధంగా దర్యాప్తు విషయంలో సీఎం, హోమంత్రి కి ఏసీబీ డీజీ రిపోర్టు చేయనక్కర్లేదని ధర్మాసనం పేర్కొంది. విచారణలో రేవంత్ జోక్యం చేసుకోవద్దని, ఒకవేళ జోక్యం చేసుకుంటే పిటిషనర్ సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చని కోర్టు పేర్కొంది. దీంతో ఓటు నోటు కేసులో సీఎం రేవంత్‌రెడ్డి కి ఊరట లభించినట్లైంది.ఈ నేపథ్యంలో ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా ఓటుకు నోటు కేసు విచారణ హాట్ టాపిక్‌గా మారింది.ఈ నేపథ్యంలో, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ట్రాన్స్‌ఫర్ పిటిషన్‌ను దాఖలు చేశారు.అందులో తెలంగాణ ప్రభుత్వం సహా రేవంత్ రెడ్డి, ఇతర ప్రతివాదులకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.
శుక్రవారం జరిగిన విచారణలో, కేసును బదిలీ చేయడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ ముగిసినట్లు పేర్కొంది. ఈ మేరకు ఆ పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్  ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కేసులో రేవంత్‌రెడ్డి విచారణను ప్రభావితం చేస్తారనే విషయం అపోహ మాత్రమేనని అభిప్రాయ పడింది. ఈ విషయంలో ఊహాజనిత జగదీష్‌రెడ్డి పిటిషన్‌ను ఎంటర్‌టైన్ చేయలేమని, స్పష్టమైన ఆధారాలు లేకుండా పిటిషన్ దాఖలు చేశారని తెలిపింది. కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు కోర్టు నిరాకరిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: