ఏపీలో అధికారం కోల్పోయాక వైసీపీ పరిస్థితి రోజు రోజుకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత చాలా మంది ముఖ్య నేతలు పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఇద్దరు, ముగ్గరు నేతలు తప్పా మిగితా నేతలు పెద్దగా యాక్టివ్ గా లేకపోవడం వైసీపీలో తీవ్ర చర్చ జరగుతుంది. అయితే ఇది ఇలా ఉంటే కొందరు నేతలు మాత్రం ప్రతిపక్షంలో ఉండడం అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారట. నిన్న మొన్నటి వరకు అధికారాన్ని అనుభవించిన నేతలు ప్రతిపక్షంలో ఉండటానికి తెగ ఇబ్బంది పడిపోతున్నారట. ఉన్న ఫళంగా పార్టీ మారితే ఎలా ఉంటుందా అన్న ఆలోచన చేస్తున్నారట. అందులో ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే నేతలే పార్టీ మారాలని ఆలోచిస్తుండడంపై వైసీపీ పెద్దలు ఆశ్చర్యానికి గురవుతున్నారట.అధికారంలో ఉన్నప్పుడు మా జగన్ అన్నా,మా జగన్ అన్నా నేతలే,ఇప్పుడు పార్టీ మారుతుండడంపై వైసీపీ నేతలు విస్మయానికి గురువుతున్నారట.పార్టీ పెట్టిన నాటి నుంచి నేటి వరకు చాలా మంది నేతలు పార్టీలోనే కొనసాగుతున్నారు. కానీ ఇటీవల జరగిన ఎన్నికల్లో ఓటమి తర్వాత కొందరి నేతల్లో చాలా మార్పు వచ్చిందని పార్టీలో చర్చ జరుగుతుంది. గత పద్నాలుగు ఏళ్లుగా జగన్ తో నడిచిన నేతలు ఇప్పుడు వారి ఆలోచనలో తేడా కనపడుతుందంట.
ముఖ్యంగా పార్టీలో మొదటి నుంచి ఉండి, అందునా జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న నేతలు ఇప్పుడు పార్టీ మారానుకోవడం పెద్ద చర్చకు తెరలేపింది. జగన్ కాంగ్రెస్ ను విభేధించి బయటకు వచ్చిన రాజకీయంగా చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో జగన్ కు వెన్నంటే నిలిచిన నేతలు సైతం ఇప్పుడు పార్టీ మారాలనుకోవడం ఏంటా అని సొంత పార్టీలోనే గుసగుసలు వినబడుతున్నాయి. జగన్ ఒక రకంగా సొంత మనుషులుగా ముద్ర ఉన్న నేతలు ఇప్పుడు పార్టీ మారుతుండడంపై రకరకాల చర్చలు కొనసాగుతున్నాయి. ఇలాంటి కష్టకాలంలో జగన్ ను ఒంటరిని చేసి వెళ్లడం ఎంత వరకు సబబు అన్న చర్చ పార్టీలో అంతర్గతంగా జరుగుతుంది. వైసీపీలో ఎందరో నాయకులు ఉన్నా..ముఖ్యంగా బాలినేని,సామినేని ఉదయభాను లాంటి వ్యక్తులు పార్టీ మారడం పట్ల బిన్న వాదనలు వినిపిస్తున్నాయి. జగన్ తో వ్యక్తిగతంగా , రాజకీయంగా ఉన్న బంధాన్ని తెంచుకొని పార్టీనీ వీడడం అస్సలు తాము ఊహించుకోలేకపోతున్నామని వైసీపీ నేతలు అనుకుంటున్నారు.ఈ నేపథ్యంలో నేతలు వైసీపీని వీడియోటంపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. ఎవరు పోతున్నారు?ఏ సీనియర్ లీడర్ పోతున్నారు? పోయే వాళ్ళు పోతే ఏమవుతుంది? ఇంకొకరు వస్తారు.నాయకుడు ప్రజల నుంచే పుడతాడు. సూపర్ సిక్స్ అంటూ వీళ్ళు చెప్పిన అబద్ధాలకు ప్రభుత్వం పై వ్యతిరేకత వస్తుంది. ఆ మోసాలు కోపాలు మారి కోపంతో వేసే ఓటు ఎవరినైనా కాల్చేస్తుంది.అధికార పార్టీలోకి ఎవరైనా వెళ్తే అది వాళ్ళ గ్రహ పాటే అని ఆయన వెల్లడించారు.