టాలీవుడ్ స్టార్ హీరో రూమ్ కు రమ్మన్నాడన్న విచిత్ర.. ఆ హీరోనే టార్గెట్ చేసిందిగా!

Reddy P Rajasekhar
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఎక్కువగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో కొంతమంది సెలబ్రిటీలు క్యాస్టింగ్ కౌచ్ వివాదాలలో చిక్కుకోవడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. కోలీవుడ్ నటి విచిత్ర తెలుగులో ఇద్దరు అగ్ర హీరోల సినిమాలలో నటించింది. అయితే తమిళ బిగ్ బాస్ షోలో ఈ నటి మాట్లాడుతూ తనకు ఎదురైన చేదు అనుభవం గురించి షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు.
 
23 సంవత్సరాల క్రితం ఒక టాలీవుడ్ స్టార్ హీరో మూవీ షూటింగ్ లో పాల్గొనగా నా పేరు కూడా అడగకుండానే ఆ స్టార్ హీరో వేధింపులకు గురి చేశాడని తెలిపారు. తాను అందుకు అంగీకరించకపోవడం వల్ల నాకు నరకం చూపించాడని విచిత్ర పేర్కొన్నారు. నేను ఫిర్యాదు చేస్తే నన్నే కొట్టారని ఈ విషయంలో కోర్టుకు వెళ్లినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని ఆమె తెలిపారు.
 
విచిత్ర ఈ కామెంట్లు చేసిన సమయంలో సోషల్ మీడియా వేదికగా ఆమె పేరు మారుమ్రోగింది. పోర్కోడి అనే తమిళ సినిమాతో ఆమె సినీ కెరీర్ మొదలైంది. ఈ వేధింపుల తర్వాత ఆమె మరే తెలుగు సినిమాలో కూడా నటించలేదు. ఈమె తండ్రి కూడా నటుడే కాగా తమిళనాడులో జరిగిన ఒక దోపిడీ ఘటనలో ఆయన మృతి చెందారు. అయితే విచిత్ర ఆరోపణలు చేసిన టాలీవుడ్ హీరో మాత్రం ఈ వివాదం గురించి స్పందించలేదు.
 
విచిత్ర అధికారికంగా ఆ హీరో పేరును బయటపెట్టి ఉంటే వివాదం మరింత పెద్దదై ఉండేదని కూడా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఆ హీరో మాత్రం ఒకానొక సందర్భంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదని కామెంట్లు చేయడం కొసమెరుపు. సినిమా ఇండస్ట్రీకి క్యాస్టింగ్ కౌచ్ శాపంగా మారిందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. రాబోయే రోజుల్లో ఈ తరహా ఘటనలు మరిన్ని వెలుగులోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: