హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఢమాల్..ఇళ్ల అమ్మకాల్లో 42 శాతం డౌన్ ?

Veldandi Saikiran
ఇండియాలో.. అత్యంత అభివృద్ధి చెందిన నగరాలలో హైదరాబాద్ ఒకటి.ముంబై, పూణే ఢిల్లీ కంటే...ఇప్పుడు హైదరాబాద్ టాప్ లో ఉందని చెప్పవచ్చు. కెసిఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు.. అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ అభివృద్ధి చెందింది.అయితే అలాంటి హైదరాబాద్ నగరం ఇప్పుడు.. అబాసపాలు అవుతోంది. హైదరాబాద్ నుంచి చాలా కంపెనీలు బయటికి వెళ్లిపోవడం, కొత్త కంపెనీలు రావడంలో సందిగ్ధత నెలకొనడం... లాంటివి సోషల్ మీడియాలో వస్తున్నాయి.
 

అయితే ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు మరో ఎదురు దెబ్బ తగిలింది. హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ దందా ఒక్కసారిగా పడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో ఇండ్లు కొనే నాధుడే లేడట. హైదరాబాద్ మహానగరంలో ఓవరాల్ గా...ఇళ్ల విక్రయాలు 42 శాతానికి తగ్గిపోయాయి అంట. అంటే దాదాపుగా గతంలో కంటే ఇప్పుడు సగానికి సగం రియల్ ఎస్టేట్ పడిపోయినట్లేనని లెక్కలు చెబుతున్నాయి.
అయితే ఈ లెక్కలను ఎవరో చెప్పింది కాదు.. రియల్ ఎస్టేట్ అనలైటిక్ సంస్థ ప్రాప్ ఈక్విటీ అనే సంస్థ ఈ షాకింగ్ విషయాలను పేర్కొనడం జరిగింది. హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ మొత్తం తగ్గిపోయిందని ఈ సంస్థ... లెక్కలతో సహా బయట పెట్టిందట. హైదరాబాద్ మహానగరంలో ఇల్లు కొనుగోలు చేసే వారి సంఖ్యను కూడా.. ఈ సంస్థ లెక్కలు వేయడం జరిగింది.  ఈ సర్వే లెక్క ప్రకారం గడిచిన జులై నెల నుంచి సెప్టెంబర్ మాసం వరకు.. ఇండ్లు కొనుగోలు చేసే వారి సంఖ్య 42 శాతం తగ్గిపోయింది అంట.
 

ఇప్పటివరకు 12000 పైచిలుకు యూనిట్ల విక్రయాలు మాత్రమే జరిగినట్లు వివరించింది ఈ సంస్థ. అదే గత సంవత్సరంలో మాత్రం 20 వేల వరకు యూనిట్లు అమ్ముడు అయ్యాయట. అప్పుడు కెసిఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు విక్రయాలు విపరీతంగా జరిగినట్లు ఈ సర్వే సంస్థ వెల్లడించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా తగ్గిపోయిందని కూడా.. ఈ సంస్థ చెప్పడం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: