ఏపీ: డ్వాక్రా మహిళలకు భారీ గుడ్ న్యూస్.. ఏమిటంటే..?.

Divya
ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిలోని సచివాలయంలో ఇటీవలె సెర్ఫ్ కార్యక్రమాల పైన ఒక సమీక్ష నిర్వహించారట.ఇందులో ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు రుణాలతో పాటు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి పలు రకాల వాటిని చర్చించినట్లు తెలుస్తోంది.ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు 10 లక్షల రూపాయల వరకు సున్నా వడ్డీ రుణాలు అమలు చేయాలంటూ ప్లాన్ చేస్తున్నారట.. దీని వల్ల ప్రతి ఏడాది కూడా 5000 కోట్లు అవుతుందన్నట్లుగా అధికారులు ఏపీ సీఎం చంద్రబాబుకు నివేదికను కూడా అందించినట్లు తెలుస్తోంది.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకే ఆడబిడ్డ నిధి కింద 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు ప్రతినెలా కూడా 1500 చొప్పున అందించడం పైన కూడా సరికొత్త మార్గదర్శకాలను రూపొందించేలా చూస్తున్నారట.. మరొకవైపు గత ప్రభుత్వంలో డ్వాక్రా మహిళలను పెద్దగా పట్టించుకోలేదంటూ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎద్దేవ చేశారు చాలా ఫేక్ సంఘాలు సృష్టించి రుణాలు పొందినట్లుగా తమ దృష్టికి వార్తలు వచ్చాయి అంటూ తెలిపారు. ఇలా పిఠాపురంలో ఎన్నికల ముందు 7 కోట్ల మేరకు అవినీతి జరిగిందని.. ఇప్పుడు ఇదే తరహాలో మరి ఎక్కడైనా జరిగిందా లేదా అనే విషయాని కోసం జిల్లాల వైద్యగా వివరిస్తున్నామంటూ తెలిపారు.
అలాగే 13 జిల్లాలలో ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ కూడా ఏర్పాటు చేసి డ్వాక్రా సంఘాలతో మద్య తరహా చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసేలా పలు రకాల చర్యలు తీసుకుంటున్నామంటే మంత్రి శ్రీనివాస్ వెల్లడించారు. అలాగే అమరావతిలో కల్చరల్ కాంప్లెక్స్ కట్టడానికి కూడా 10 ఎకరాలు కేటాయించాలని ఏపీ సీఎం ముందు ప్రతిపాదన ఉంచామని వీటికి సానుకూలంగానే స్పందిస్తున్నారంటూ తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా చదువుకున్న నిరుద్యోగ మహిళలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది అంటూ తెలుపుతున్నారు. ఇవే కాకుండా మరికొన్ని వాటిని కూడా ప్రతిపాదన తీసుకువస్తున్నామంటూ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: