7 ఏడుకొండల వారి చుట్టే...అడుగడుగునా రాజకీయాలే...అందరూ దొంగలేనా?

Veldandi Saikiran
* ప్రభుత్వం మారినాకొద్దీ తిరుమలలో ఏదో ఒక వివాదం
* జగన్ పాలనలో క్రైస్తవులకు ఉద్యోగాలు, చైర్మన్ పదవి
* తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ  
* పింక్ డైమండ్ వివాదం
* తిరుమలలో చిరుతల సంచారం

 
ప్రపంచంలోనే తిరుమల శ్రీవారి ఆలయానికి ప్రత్యేకత ఉంది. ప్రపంచంలో నలుమూలల నుంచి మతంతో సంబంధం లేకుండా చాలామంది భక్తులు తిరుమల శ్రీవారిని  దర్శించుకుంటున్నారు. రోజుకు లక్ష మంది భక్తులు తిరుమల శ్రీవారి సన్నిధికి వస్తారు. అటు హుండీ ఆదాయం రోజుకు మూడు నుంచి ఐదు కోట్ల వరకు నమోదు అవుతుంది. రోజుకు లక్ష లడ్డూలు కూడా విక్రయాలు జరుపుకుంటున్నాయి.
 
అయితే అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానం పైన రాజకీయ రంగులు పులుముకుంటున్నాయి.జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ అయిందని తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొనడం.. వివాదంగా మారింది. తక్కువ ధరకు.. తీసుకువచ్చిన నెయ్యిని వాడారని ఆయన తెలిపారు. అంతేకాదు జంతువుల నుంచి తయారైన కొవ్వును కూడా వాడినట్లు ఆరోపణలు చేశారు బాబు.
 
ఇప్పుడు ఈ లడ్డూల కల్తీ అంశం విభాగంగా మారి... దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అయితే ఇలాంటి వివాదాలు గతంలో కూడా వచ్చాయి. పింక్ డైమండ్ వివాదం అప్పట్లో రచ్చ జరిగింది. పింక్ డైమండ్ వివాదంలో.. మాజీ ప్రధాని అర్చకులు  రమణ దీక్షితులు కూడా ఇరుక్కున్న సంగతి తెలిసిందే. 2014 సంవత్సరంలో టిడిపి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఆ ప్రభుత్వం పైన వైసిపి అనేక ఆరోపణలు చేసింది. చంద్రబాబుకు సంబంధించిన  కులం వారికి టీటీడీలో పదవులు దక్కాయని కూడా వైసిపి ఆరోపణలు చేసింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పాలనలో.. టీటీడీ వివాదంగా మారింది.
జగన్మోహన్ రెడ్డి ఒక క్రైస్తవుడు కాబట్టి ఈ అంశాన్ని టిడిపి బాగా వాడుకొని విమర్శలు చేస్తోంది.  టీటీడీ ఉద్యోగాలు అలాగే చైర్మన్ పదవిని క్రైస్తవులకు కట్టబెట్టారని కూడా చెబుతున్నారు  టిడిపి నేతలు. అలాగే జగన్మోహన్ రెడ్డి పాలనలోనే చిరుతలత సంచారం విపరీతంగా పెరిగింది. ఓ చిన్నారి కూడా ఈ దాడిలో మరణించడం జరిగింది. ఆ సమయంలో.. నడిచి వెళ్లే భక్తులకు కర్రలు ఇవ్వడం.. ట్రోలింగుకు దారితీసింది. ఇలా ప్రభుత్వం మారిన కొద్దీ.. తిరుమల కొండపైన రాజకీయ పార్టీలు రచ్చ చేస్తూనే ఉన్నాయి. భక్తులతో ఆడుకుంటున్నాయి ఈ పార్టీలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: