వేములవాడ: తప్పతాగి నైవేద్యం సమర్పణ.. శివ శివా ఏందయ్యా ఈ అపచారం..?

Pandrala Sravanthi

-దక్షిణ కాశీగా పేరున్న వేములవాడ రాజన్న..
-భక్తుల కొంగు బంగారం రాజన్న స్వామి..
- నిష్టగా కొలవాల్సిన పండితులే తప్పతాగి..

 వేములవాడ రాజన్న క్షేత్రం.. దీనికి ఎంతో ఘన చరిత్ర ఉంది. దక్షిణ కాశిగా పేరుపొందిన ఈ దేవాలయం లో శివయ్య కొలువు తీరి ఉన్నాడు. భక్తుల కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీర్చే శివుడు.. ప్రతిరోజు ఎన్నో పూజలు అందుకొని శివ నామ స్మరణలో తులతూగిపోతుంటాడు. అలా రోజుకు వేలాదిమంది భక్తులు శివున్ని దర్శనం చేసుకుంటారు. కానుకలు సమర్పించి కోరికలు తీర్చమని వేడుకుంటారు. అలాంటి శివయ్య గుడిలో  ఒక అపచారం జరిగింది. మరి ఏం జరిగింది అనే వివరాలు చూద్దాం..
 భక్తుల కొంగు బంగారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి..భక్తులందరూ ఆ స్వామిని తన ఇంట్లో మనిషిగా రాజన్న అని పిలుస్తారు. ఈ స్వామిని దర్శించుకోవడానికి కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు వస్తుంటారు. అలా ఎంతోమంది భక్తులు వచ్చి స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. ఇలా దూరపు ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఎంతో భక్తితో కొలుస్తుంటే స్వామి వారి సన్నిధిలో ఎల్లప్పుడూ ఉంటూ నివేదనలు సమర్పించే పండితులు మాత్రం అపచారం చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 11:30 నిమిషాలకు స్వామివారికి అనాదిగా జరుగుతూ వస్తున్నటువంటి నివేదన కార్యక్రమం  ఈమధ్య ఏకంగా అరగంట లేటుగా నివేదించారు. అంతేకాకుండా నివేదన కోసం వంట తయారు చేసే బ్రాహ్మణుడు తప్ప తాగి నివేదన తయారు చేశారట.

అరగంట లేట్ అయిందని హడావిడిగా వంటకాలు తయారు చేయడంతో వంటకాలన్నీ మాడిపోయాయట. ఈ విధంగా నిర్లక్ష్య ధోరణితో గుడికి ఉడకని అన్నాన్ని  తయారుచేసి స్వామివారికి సమర్పించి మమా అనిపించారట. ఇక ఇవే కాకుండా  రాజన్న ఆలయంలో అక్రమాలు జరుగుతున్నాయని ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అంతేకాకుండా రాజన్న సన్నిధికి ఎంతోమంది భక్తులు  కోడెలను సమర్పిస్తారు. వాటి నిర్వహణ విషయంలో కూడా  అధికారులు తప్పు చేస్తున్నారట. సమర్పించిన పశువులకు సరైన ఆహారం అందించకపోవడంతో చాలా ఆ మధ్యకాలంలో ఎన్నో కోడెలు మరణించాయి. ఎంతో ఘన కీర్తి కలిగినటువంటి రాజరాజేశ్వర స్వామి ఆలయ విషయంలో ఇన్ని తప్పులు జరుగుతున్నా కానీ ఆలయ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని  అక్కడికి వచ్చిన భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: