చిక్కుల్లో రేవంత్ రెడ్డి.. రూ.8888 కోట్ల భారీ కుంభకోణం..?

Veldandi Saikiran
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత... అనేక ఆరోపణలు తెరపైకి.. రావడం జరుగుతుంది. దీనికి తగ్గట్టుగానే గులాబీ పార్టీ చాలా బలంగా.. రేవంత్ రెడ్డి ప్రభుత్వ తప్పిదాలను తెరపైకి తీసుకువస్తుంది.  మూసి ప్రక్షాళన, కాలేశ్వరంపైతప్పుడు ప్రచారం, రేషన్ బియ్యం లో స్కాం, ఇసుక దందా.. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కోమంత్రికి.. ఒక్క చరిత్ర ఉందని ఇప్పటికే... గులాబీ నేతలు ఆరోపణలు మొదలుపెట్టారు.

ఇలాంటి నేపథ్యంలో... రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏకంగా 8888 కోట్ల అవినీతి జరిగిందని.. గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.అసలు అర్హత లేని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి అలాగే ఆయన తమ్ముని కంపెనీల కు...భారీ స్థాయిలో కాంట్రాక్టులు కట్టబెట్టాలని కేటీఆర్... కేంద్రానికి ఫిర్యాదు చేశారు. అమృత టెండర్ల అవినీతిపైన  కేటీఆర్ ప్రశ్నించడం జరిగింది.

అంతేకాదు అమృత టెండర్ల అవినీతి పైన పక్కా ఆధారాలతో కేంద్ర మంత్రులకు లేఖ రాశారు గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రులు మనోహర్ లాల్ కట్టర్, టోచన్ సాహూలకు కేటీఆర్ లేఖ రాయడం జరిగింది. వందల కోట్ల రూపాయల కాంట్రాక్టులను అప్పనంగా దక్కించుకున్న రేవంత్‌  కుటుంబీకుల వ్యవహారం పై విచారణ చేయాలని ఈ లేఖలో గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కోరారు.
అమృత్ పథకంలో జరిగిన ప్రతి టెండర్, పనులు దక్కించుకున్న కంపెనీల వివరాలను బహిర్గతం చేయాలని కేంద్రాన్ని కేటీఆర్‌ కోరారు.అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన ప్రతి టెండర్ ని సమీక్షించి, ఈ చీకటి టెండర్లను రద్దు చేయాలని కూడా డిమాండ్‌ చేశారు. అయితే.. దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి స్పందిస్తూ.. సీఎం రేవంత్‌ రెడ్డి సొంత బావ మరిది కాదని క్లారిటీ ఇచ్చారు. అందులో ఎలాంటి స్కాం జరుగలేదని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: