రేవంత్‌ కు ఇద్దరు మంత్రుల వెన్నుపోటు..యడ్యూరప్పకు పట్టినే గతేనా ?

Veldandi Saikiran
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఒకవైపు హైదరాబాద్ మహానగరంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతుంటే... మరోవైపు కాంగ్రెస్ పార్టీపై అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ప్రతి పథకం అలాగే ప్రతి.. కాంట్రాక్టులో కాంగ్రెస్ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని గులాబీ పార్టీ నేతలు... ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా.. ఇద్దరు తెలంగాణ మంత్రులు వ్యవహరిస్తున్నారని సమాచారం.

ఇందులో మొట్టమొదటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని సమాచారం. రేవంత్ రెడ్డికి వెన్నుపోటు పొడిచేలా ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్నారని సమాచారం. ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం పెద్దల అపాయింట్మెంట్ కేవలం ఉత్తంకుమార్ రెడ్డి గా ఇస్తున్నారట.  రేవంత్ రెడ్డి బాగోతం మొత్తం ఢిల్లీ పెద్దలకు ఉత్తంకుమార్ రెడ్డి వివరిస్తున్నారట. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్న కూడా తెలుగుదేశం నాయకుడిలా ప్రవర్తిస్తున్నాడని... ఉత్తంకుమార్ రెడ్డి తో పాటు పలువురు మంత్రులు వివరిస్తున్నారట.

అందుకే ఢిల్లీలో రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఈ మధ్య తగ్గిపోయిందని సమాచారం. అతి త్వరలోనే రేవంత్ రెడ్డి పై వేటు వేసి ఉత్తంకుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తారని కూడా ఒక వార్త వస్తుంది. అయితే ఇదే సమయంలో అమృత్ టెండర్ల  విషయంలో... భారీ స్కాం జరిగిందని గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ ఆరోపణలు చేశారు. దాదాపు 9,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి... కుటుంబం స్కామ్ చేసిందని కూడా ఆయన తెలిపారు. ఈ అమృత్ టెండర్ల విషయంలో...రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డికి... టెండర్లు దక్కాయని కేటీఆర్ ఆరోపణలు చేశారు.

అయితే ఈ విషయంలో.. మంత్రి పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. సృజన్ రెడ్డి అసలు రేవంత్ రెడ్డికి బామ్మర్ది కాదని ఆయన తెలిపారు. కానీ సృజన్ రెడ్డి మాత్రం రేవంత్ రెడ్డి బామ్మర్దినే. రేవంత్ రెడ్డిని కావాలనే ఇరికించాలని పొంగిలేటి ఇలా మాట్లాడినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.  కేటీఆర్ కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నారు. యడ్యూరప్ప, అశోక్ చౌహాన్ తరహాలోనే... రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి పదవి కోల్పోతాడని.. బాంబు పేల్చారు కేటీఆర్. ఆ పార్టీలోనే ఉన్న మంత్రులు రేవంత్ రెడ్డికి వెన్నుపోటు పొడుస్తున్నారని కూడా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: