వైసీపీ టాప్ లీడ‌ర్‌ల‌కు జ‌న‌సేన‌లో కీల‌క ప‌ద‌వులు.. !

RAMAKRISHNA S.S.
ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎంత శ‌ర‌వేగంగా మారుతున్నాయో చూస్తున్నాం. వైసీపీ నాయకులు ఒక్కొక్కరు వ‌రుసపెట్టి.. ఆ పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. వైసీపీని వీడి బయటకు వస్తున్న నాయకులలో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ కంటే జనసేనలోకి వెళుతున్న వాతావరణం కనిపిస్తుంది. కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు కాకుండా.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాంటి నేతలు కూడా జనసేన వైపే చూస్తున్నారు. ఇటీవల మాజీమంత్రి జగన్‌కు సమీప బంధువు అయిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే శామినేని ఉదయభాను ఆ పార్టీని వీడారు.

వీరిద్దరూ ఇప్పటికే పవన్ కళ్యాణ్ ను కలిశారు. జనసేనలో కూడా చేరిపోనున్నారు. వీరిద్దరు జనసేనలో చేరేందుకు జనసేన అధినేత.. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం ఓకే చెప్పేశారు. తాము ఎందుకు వైసీపీని వేడాల్సి వచ్చిందో వారు నేరుగా పవన్ కు చెప్పారు. ఈ క్రమంలోనే వారిద్దరూ జనసేనలో చేరుతుండడంతో ఒంగోలు, జగ్గయ్యపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నేతలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని పవన్ కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అలాగే ఈ ఇద్దరు కీలక నేతలకు ఎమ్మెల్సీ అవకాశాలు కల్పిస్తామని.. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.

ప్రకాశం జిల్లా ఒంగోలు మాజీ ఎమ్మెల్యే గా ఉన్న బాలినేని గతంలో వైఎస్ఆర్.. ఆ తర్వాత జగన్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేటకు చెందిన సామినేని ఉదయభాను.. మెగా కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా పేరు పొందారు. వైయస్ హ‌యాంలో.. ఆ తర్వాత జగన్ హయాంలో ఎమ్మెల్యేగా.. ప్రభుత్వ విప్ గా పనిచేశారు ఉదయభాను. సీనియారిటీ కోటాలో తనకు జగన్ కచ్చితంగా మంత్రి పదవి ఇస్తారని ఆశలు పెట్టుకుంటే.. జగన్ ఇవ్వలేదు. ఇక జనసేనలో చేరుతున్న ఈ ఇద్దరు నేతలకు.. అక్కడ పవన్ రాచ మర్యాదలు కల్పించడం కాయంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: