ఏపీ మహిళలకు ఫ్రీ బస్.. ఈ స్కీమ్ అమలు గురించి మంత్రి క్లారిటీ ఇదే!
ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ గురించి పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చేశారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు. దీపావళి పండుగ నుంచి అర్హత ఉన్న ప్రతి ఫ్యామిలీకి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని మంత్రి చెప్పుకొచ్చారు. డ్వాక్రా సంఘాలకు 5 నుంచి 10 లక్షల రూపాయల వరకు రుణాలను మంజూరు చేస్తామని మంత్రి చెప్పుకొచ్చారు.
అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు మూడు పూటలా ఆహారం అందిస్తున్నామని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. త్వరలోనే ఫ్రీ బస్ స్కీమ్ అమలైతే మాత్రం మహిళల ఆనందానికి అవధులు ఉండవు. ఏపీ సర్కార్ సూపర్ సిక్స్ లో భాగంగా ఇచ్చిన ప్రతి హామీని శరవేగంగా అమలు చేస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సూపర్ సిక్స్ స్కీమ్స్ వల్లే కూటమి ఎక్కువ సంఖ్యలో స్థానాలతో అధికారంలోకి వచ్చింది.
సూపర్ సిక్స్ స్కీమ్స్ అమలు కోసం ఎక్కువ మొత్తం ఖర్చు అయ్యే అవకాశం ఉన్నా ఆలస్యంగానైనా ఈ స్కీమ్స్ ను అమలు చేయడం పక్కా అని కూటమి సర్కార్ చెబుతోంది. కూటమి సర్కార్ ఇప్పటికే పింఛన్ల పెంపు స్కీమ్ ను ఆమలు చేయగా ఈ స్కీమ్ అమలు వల్ల ఎంతోమంది వృద్ధులు బెనిఫిట్ పొందుతున్నారనే సంగతి తెలిసిందే. కూటమి సర్కార్ ప్రజల సంక్షేమంపై ప్రధానంగా దృష్టి పెట్టింది. ఏపీ మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.