సీబీఐ విచారణ విషయంలో కూటమి సర్కార్ వెనుకడుగు.. అసలు కారణాలివేనా?

Reddy P Rajasekhar
తిరుమల లడ్డూ వివాదం రోజురోజుకూ అంతకంతకూ పెద్దదవుతోందే తప్ప తగ్గడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఘటన ఒకింత సంచలనం సృష్టిస్తోంది. ప్రముఖ సెలబ్రిటీలు సైతం నిజంగా తప్పు జరిగిందని ప్రూవ్ అయితే మాత్రం దోషులను కఠినంగా శిక్షించాలని కామెంట్లు చేస్తున్నారు. అయితే సీబీఐ విచారణ విషయంలో కూటమి సర్కార్ వెనుకడుగు వేస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
 
అయితే సీబీఐ విచారణ విషయంలో కూటమి సర్కార్ వెనుకడుగు వేయడం వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయని తెలుస్తోంది. తిరుమల లడ్డూ వివాదానికి సంబంధించి మరింత స్పష్టత రావాల్సి ఉందని ఆ రీజన్ వల్లే సీబీఐ విచారణ దిశగా అడుగులు వేయట్లేదని భోగట్టా. ఈ వివాదం మత విశ్వాసాలకు సంబంధించినది కావడంతో ఏపీ సర్కార్ సైతం తొందర పడకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.
 
కూటమి సర్కార్ విమర్శలకు తావివ్వకుండా అడుగులు వేస్తుండటం గమనార్హం. హిందువుల అధ్యాత్మిక రాజధాని అయిన తిరుమల విషయంలో ఏదైనా తప్పు జరిగితే మనోభావాలు సైతం దెబ్బ తింటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సిట్ కాదని సీబీఐ దర్యాప్తే ముఖ్యమని విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.
 
చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూ వివాదంలో ఆరోపణలను పూర్తిస్థాయిలో ప్రూవ్ చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పవచ్చు. రాజకీయ నాయకులు ఈ వివాదం విషయంలో సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇస్తే మాత్రం ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. సీబీఐ ఎంట్రీ ఇస్తే మాత్రం అసలు నిజాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు వేగంగా సంక్షేమ పథకాలను అమలు చేయాలని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు 100 రోజుల పాలన ఏ విధంగా ఉందనే ప్రశ్నలకు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. చంద్రబాబు నాయుడు వయస్సు పెరుగుతున్నా తన ఎనర్జీ లెవెల్స్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: