జగన్‌కు రాహుల్ గాంధీ నో అపాయింట్మెంట్.. ఫోన్ కూడా లిఫ్ట్ చేయ‌లేదా..?

RAMAKRISHNA S.S.
వైసీపీ అధినేత.. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి జాతీయ స్థాయిలో తనకు ఇండి కూటమి మద్దతు ఉంటుందని ఢిల్లీలో చేసిన ధర్నా ద్వారా సంకేతాలు పంపే ప్రయత్నం చేశారు. లడ్డు విభాగం తర్వాత ఆయన లాంటి రాజకీయ నాయకుడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని అందరూ అనుకుంటున్నారు. జాతీయ స్థాయిలో పలువురు రాజకీయ నాయకులు కూడా ఇదే విషయం చెబుతున్నారు. చివరికి రాహుల్ గాంధీ కూడా లడ్డు వివాదంలో వ్యతిరేకంగా స్పందించారు. దీంతో వైసీపీకి ఏమైనా ఆశలు ఉంటే ఆవిరి అయ్యాయి. లడ్డు వివాదం తర్వాత నార్త్ ఇండియాలో చాలావరకు రియాక్షన్ వచ్చింది.

దక్షిణాది రాష్ట్రాలలో చాలామంది భక్తులు రోడ్లు ఎక్కారు. ఎప్పుడు ఎలా స్పందించాలో అలా స్పందిస్తారు. కానీ.. ఉత్తరాన హిందూ వాదులు మాత్రం చాలా కోపంతో ఆగ్రహంతో స్పందించారు. ఇది ఓ మత ఔన్నత్యానికి సంబంధించిన విషయం కావడంతో తప్పును తప్పు పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే బిజెపి నేతలు అంతా స్పందించారు. చాలా చోట్ల జగన్ దిష్టిబొమ్మలను సైతం దహనం చేశారు. హిందువుల్లో ఓ రకమైన అసంతృప్తి ఉత్తరాదిన ఉంది. లడ్డు కల్తీకి కారణం జగన్ అన్న అభిప్రాయం బలపడింది. ఇలాంటి సమయంలో జగన్‌కు ఏ కోణంలో మద్దతు పలికినా అది తమకు నష్టం అవుతుందని ఇండి కూటమి పార్టీలు భావిస్తున్నాయి.

తాజాగా కొద్ది రోజుల క్రితం జగన్, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అడిగిన ఇవ్వలేదని తెలుస్తోంది. ఇక ఇప్పుడు లడ్డు వివాదం తర్వాత రాహుల్ గాంధీ కనీసం జగన్ ఫోన్ కూడా లిఫ్ట్ చేయక‌పోడంతో మాట్లాడేందుకు కూడా ఇష్టపడరు అన్న ప్రచారం జాతీయ‌ మీడియాలో జరుగుతుంది. మెల్లగా కాంగ్రెస్ కూట‌మి వైపు వెళ్లేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నాలు లడ్డు వివాదంతో ఆగిపోతాయని అనుకోవచ్చు. ఏది అయినా శ్రీవారి లడ్డూల్ని కల్తీ చేశారని అపకీర్తి మూటగట్టుకున్న జగన్‌తో పెట్టుకుంటే మొదటికే మోసం వస్తుందని ఇండి కూటమి ఎక్కువ పార్టీలు భావిస్తున్నాయట. అందుకే జగన్ రెడ్డి అటు కాంగ్రెస్‌కు బిజెపికి దగ్గర కాలేక ఎప్పటికీ ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: