2029లో వైసీపీ ఖేల్ఖతం.. దుకాణం బంద్.. బాబు, పవన్ మాస్టర్ స్కెచ్ సక్సెస్.. !
- ( అమరావతి - ఇండియా హెరాల్డ్ ) .
2024 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో అదిరిపోయే వ్యూహంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి వైసీపీకి చెక్ పెట్టారు. 2019 ఎన్నికలలో వైసీపీకి వచ్చిన 151 సీట్లు పూర్తిగా తగ్గించడానికి వ్యూహం వేశారు. ఈ వ్యూహంలో భాగంగానే జగన్కు 151 నుంచి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. 2024 నుంచి 2029 ఎన్నికలకు వచ్చేసరికి జగన్ మోహన్ రెడ్డికి వచ్చిన 39.4 ఓట్ల శాతాన్ని మరింతగా తగ్గించడానికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇప్పటినుంచి ప్రత్యేక కసరత్తులు చేస్తూన్నారు.
ఈ క్రమంలోనే వైసీపీకి చెందిన పలువురు కీలక నేతలను అయితే తెలుగుదేశం లేదా జనసేనలో చేర్చేసుకుంటున్నారు. చివరకు జగన్కు సమీప బంధువు అయిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాంటి వారు సైతం జనసేనలో చేరుతున్నారు. అంటే 2029 టార్గెట్గా పెట్టుకుని పవన్, చంద్రబాబు ఎలా రాజకీయం చేస్తున్నారో తెలుస్తోంది. తాజాగా టీటీడీ మండలిలో జరిగిన తప్పులను పూర్తిగా బయటకు తెచ్చి.. దోషులను ప్రజల ముందు ఉంచుతున్నారు. తిరుమల లడ్డు వివాదంతో వైసీపీకి హిందూ ఓట్లు శాశ్వతంగా దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
యావత్ ప్రపంచంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన తిరుపతి లడ్డూ విషయంలో జరిగిన ఘోరాన్ని బయటపెట్టి ప్రపంచం ముందు జగన్మోహన్ రెడ్డిని దోషిగా నిలబెట్టారు అని చెప్పాలి. వైసీపీ వాళ్లు, రాజకీయ విశ్లేషకులు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా.. వైసీపీకి ఈ విషయంలో భారీ నష్టం జరిగింది. ఈ ఐదేళ్లలో వైసీపీకి ఉన్న ఓటు బ్యాంకును మరో 5 లేదా 10 శాతానికి తగ్గించే వాతావరణం కనిపిస్తోంది. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ... పవన్ కళ్యాణ్ వ్యుహాత్మక చాణక్యం 2029 ఎన్నికలలో కూడా వైసీపీని అధికారానికి దూరం చేసే పరిస్థితి కనిపిస్తోంది.