అమెరికాకు వెళ్లే ఇండియన్ స్టూడెంట్స్‌కి ఆరు సవాళ్లు..?

Suma Kallamadi
* అమెరికాకి వెళ్తున్న ఇండియన్ స్టూడెంట్స్‌కి అన్నింటా ఎదురు దెబ్బలే  
* ప్రాణాలతో పోరాడాల్సిన పరిస్థితి
* వారికి ఆరు సవాళ్లు కూడా ఉన్నాయి
(భారతదేశం - ఇండియా హెరాల్డ్)
అమెరికాలో చదువుకోవాలని, అక్కడే ఉద్యోగం సంపాదించి సెటిల్ కావాలని ప్రతి భారతీయ విద్యార్థి కోరుకుంటాడు ఈ రోజుల్లో ధనికులు మాత్రమే కాదు మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ కూడా అమెరికాకు వెళ్ళిపోతున్నారు. ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకొని ఏదో ఒక యూనివర్సిటీలో చదువు పూర్తి చేస్తున్నారు కానీ వారికి అక్కడ మంచి ఉద్యోగాలు లభించడం లేదు. తిరిగి ఇంటికి వచ్చేస్తే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ముందు పరువు పోతుందని చాలామంది అక్కడే ఉండి పోతున్నారు. అమెరికాలో ఉంటున్నామని పేరే తప్ప వారు మంచి లైఫ్ లీడ్ చేయలేకపోతున్నారు. కొందరైతే అక్కడ ప్రజల చేతిలో దారుణంగా హత్యలకు గురవుతున్నారు.
ఇటీవల కాలంలో అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థులపై దాడులు పెరిగిపోతున్నాయి. చికాగోలోని ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ విద్యార్థి సయ్యద్ మజాహిర్ అలీని దొంగలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఓహియోలోని సిన్సిన్నాటిలో శ్రేయస్ రెడ్డి అనే విద్యార్థిని అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయినట్లు కనుగొన్నారు. ఇండియానాలోని పర్డ్యూ యూనివర్సిటీ విద్యార్థి నీల్ ఆచార్య కూడా మరణించాడు. జార్జియాలో వివేక్ సైని అనే విద్యార్థిని ఒక హోమ్ లెస్ పర్సన్ చేతిలో మర్డర్ అయ్యాడు. ఈ సంఘటనల వల్ల అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థుల భద్రతపై ప్రశ్నార్థకాలు వెలువడుతున్నాయి.
అమెరికాలో ఉన్నత చదువులు చదవడానికి వెళ్లే భారతీయ విద్యార్థులు చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు. అక్కడి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, కొత్త అనుభవాలు వారిని ఆకర్షిస్తాయి. కానీ వారికి చాలా సమస్యలు కూడా ఎదురవుతాయి. అక్కడి సంస్కృతి, చదువు చదువుకునే విధానం, డబ్బు సంపాదించడం, భాష వారిని బాగా ఇబ్బంది పెడతాయి. ఈ సమస్యలను ఎదుర్కోవడానికి చాలా ధైర్యం, సమయానికి తగినట్లు మారే స్వభావం అవసరం. దురదృష్టవశాత్తు, అమెరికాలో భారతీయ విద్యార్థులపై దాడులు పెరుగుతుండటం వల్ల వారి పరిస్థితి మరింత కష్టంగా మారింది. వారు భయంతో ఉంటున్నారు. ముఖ్యంగా వారికి 6 సవాళ్లు ఎదురవుతున్నాయి. అవేవో చూద్దాం.
* భయం, ఆందోళన
అమెరికాలో భారతీయ విద్యార్థులపై దాడులు పెరిగిపోవడంతో వారు చాలా భయపడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఈ దాడుల వల్ల వారి రోజువారీ జీవితం కష్టతరమైంది. తమ ప్రాణాలకు భయపడుతూ జీవిస్తున్నారు. ఈ నిరంతర భయం వారి మనసును, శరీరాన్ని బాగా నీరసపరుస్తుంది.
* సహాయం కోరడంలో సందేహం
చాలా మంది విద్యార్థులు తమపై జరిగిన దాడుల గురించి పోలీసులకు చెప్పడానికి భయపడుతున్నారు. కారణం వారికి ఆ భాష రాకపోవడం, అక్కడి సంస్కృతి గురించి తెలియకపోవడం, పోలీసులపై నమ్మకం లేకపోవడం వంటివి. దీని వల్ల వారికి న్యాయం జరగదు, ఎవరూ వారికి సహాయం చేయరు.
* చదువుపై ప్రభావం
ఈ దాడుల వల్ల విద్యార్థులు భయంతో ఉంటున్నారు. దీని వల్ల వారు చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారు. ఇప్పటికే వారు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలతో పాటు ఈ భయం వారికి మరింత ఒత్తిడిని కలిగిస్తుంది.
* విద్యా, సాంస్కృతిక సర్దుబాట్లు
ఇతర దేశాల నుండి చదువుకోవడానికి వెళ్ళే విద్యార్థులకు అక్కడి చదువు చదువుకునే విధానం, సంస్కృతి అలవాటు పడడం కష్టమే. అదే విధంగా భారతీయ విద్యార్థులకు ఇంగ్లీష్ భాష సరిగా రాకపోవడం, అక్కడి చదువు చదువుకునే విధానం మనదానికి భిన్నంగా ఉండటం, ఇతరులతో కలిసి మెలగడం కష్టంగా ఉండటం వంటి సమస్యలు ఎదురవుతాయి.
* మానసిక ఆరోగ్య ఆందోళనలు
కొత్త దేశానికి వెళ్లి చదువుకోవడం వల్ల చాలామంది విద్యార్థులకు తమ దేశం మాత్రమే గుర్తుకు వస్తుంది. ఒంటరిగా ఉండటం వల్ల వారు మానసికంగా చాలా బాధపడతారు. అంతేకాకుండా చదువు మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అక్కడికి వెళ్లి మనసుకు సంబంధించిన సమస్యలకు చికిత్స చేయించుకోవడం కష్టం. దీంతో వారికి తగిన సహాయం దొరకదు.
* సమాజంలోకి వెళ్లకుండా విడిగా ఉంటున్నారు
ఇతర విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయనే భయంతో చాలామంది విద్యార్థులు ఇతరులతో కలిసి బయట తిరగడానికి భయపడుతున్నారు. ఇలా ఒంటరిగా ఉండటం వల్ల వారి మానసిక ఆరోగ్యం మరింత దెబ్బతింటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: