మతం ముసుగున రాజకీయాలు.. నేతలకు తంటాలు తప్పవా..?

Pandrala Sravanthi
 తోటి దేశాలు  టెక్నాలజీతో దూసుకుపోతుంటే  మన ఇండియాలో మాత్రం మతం, కులం అనే మాటల  మత్తు సృష్టించి అదే మత్తులో ప్రజల్ని దింపుతున్నారు. అభివృద్ధిని మూలన పడేసి  యువతకు ఉద్యోగ కల్పన పక్కనపెట్టి  మతం, దేవుడు అంటూ ప్రజల్ని దాని చుట్టే తిప్పుతూ ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు కొన్ని రాజకీయ పార్టీలు.. అభివృద్ధి పై ప్రశ్నించకుండా ఏదో ఒక వివాదాన్ని ప్రతిక్షణం లాగుతూ దాని గురించే అందరూ చర్చించుకునేలా ప్రజల్ని  డైవర్ట్ చేస్తున్నారని చెప్పవచ్చు. ఇలా చీకటి రాజకీయాలు చేస్తూ మతకల్లోలాలు సృష్టిస్తూ  పబ్బం గడుపుతున్న రాజకీయ పార్టీలు  ఎంతో కాలం నిలబడవు. ప్రతి వ్యక్తి అప్డేట్ అవుతున్నాడు. కులం, మతం అని పబ్బం గడిపే రాజకీయ నాయకులను  తొందరలోనే పాతరేసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే కులమత రాజకీయాలు ఒక కుటుంబాన్ని కాపాడలేవు. ఒక కుటుంబ వ్యవస్థను కాపాడే ఉద్యోగాన్ని ఇవ్వలేవు. ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంటే తప్పనిసరిగా  విద్యా, వైద్యం,ఉద్యోగ కల్పన అందించాలి.. 

 అలా అందించకుండా ఉచితాల పేరుతో మతం మాటున రాజకీయాలు చేస్తే ఏదో ఒక టైంలో అది బెడిసి కొడుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుత రాజకీయ పార్టీల పాలనలో ధరలు, ఉపాధి, నిరుద్యోగం విపరీతంగా వేధిస్తోంది. వీటన్నింటినీ క్లియర్ చేయకుండా ప్రభుత్వాలు కులమతా అంశాల చుట్టూ తిప్పుతూ ప్రజల్ని భ్రమల్లోకి నెడుతున్నారు. ఈ విధంగా భౌతిక సమస్యల నుంచి భావోద్వేగా అంశాలతో వీరు గడుపుతున్నారు. కానీ ఇది ఎల్లకాలం సాగదని అర్థం చేసుకోవడం లేదు.  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత రాజకీయాలను చేసే పనిలో పాలక పక్షాలన్నీ ఉన్నాయి.  ఒకరిని మించి మరొకరు మతం మంటలు రాజేసి పబ్బం గడపాలని ప్రయత్నం చేస్తున్నారు. 

కానీ ఆ మంటల్లోనే వారు కాలిపోయే పరిస్థితి త్వరలోనే రానుందని గ్రహించలేకపోతున్నారు. ఎంతోమంది వ్యక్తులు కులం పేరుతో రెచ్చిపోతున్నారు. మరి కొంతమంది మతం పేరుతో రెచ్చిపోతున్నారు. ఇలా కులమతాల పేరుతో రెచ్చిపోవడం అనేది కొన్నాళ్లపాటు మాత్రమే ఉండగలుగుతుంది. ఎందుకంటే ఈ రెండు అంశాల మాటున మనిషి అభివృద్ధి అనేది ఆగిపోతుంది. అలాంటప్పుడు కొన్నేళ్లు గడిచేసరికి కులం లేదు మతం లేదనే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రాజకీయ పార్టీలైనా సరే నాయకులైనా సరే కుల మతాల మాటున రాజకీయాలు చేయకుండా, అభివృద్ధి మాటున రాజకీయాలు చేస్తూ  ప్రజలకు ఉపాధి కల్పన అందించే విధంగా ముందుకు వెళ్లాలని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: