జమిలికి బాబోరు సై అంటారా..?సైలెంట్ గా వుంటారా..?
* దేశ రాజకీయాలను కబళించిన జమిలి ఆమోదం
* త్వరలో పార్లమెంట్ లో ప్రత్యేక బిల్లు
* బలం లేకున్నా సాహసం చేస్తున్న బీజేపీ
* మిగతా పార్టీలు సరే..బాబోరు ఒప్పుకుంటారా..?
ఆ ఆరు సవరణలు అమలు కావాలంటే 2/3 మెజార్టీతో సభ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం లోక్ సభలో బీజేపీ సభ్యులకు అంత బలం లేదు. అదనంగా ఎంపీల మద్దతు అవసరం.లోక్ సభలో ప్రస్తుతం ఎన్డీయేకి ఉన్న బలం 293 మంది. కానీ జమిలి బిల్లు ఆమోదం పొందాలంటే 362 మంది సభ్యుల అవసరం. అలాగే ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందాలంటే బీజేపీ మరింత కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే రాజ్యసభలో ఎన్డీయే బలం 121 మంది మాత్రమే. జమిలి ఆమోదం పొందాలంటే 164 మంది సభ్యులు అవసరం. వీటితో పాటు దేశంలోని సగం రాష్ట్రాలకి పైగా ఈ బిల్లుకు ఆమోదం తెలపాలి.. అయితే ప్రస్తుతం బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఇది మోదీకి కాస్త కలిసి వచ్చే అంశమే..అయితే ఈ బిల్లుకు ఎన్డీఏలో కీలక భాగస్వామ్యంగా ఉన్న టిడిపి అంగీకరిస్తుందా అనేది ప్రశ్నగా మారింది..
అసలు జమిలి ఎన్నికల విషయంలో టిడిపి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఆలోచన ఏమిటనేది మాత్రం క్లారిటీ రావాల్సి వుంది. పార్లమెంట్ ఉభయ సభలలో జమిలి బిల్లు ఆమోదం పొందాలంటే చంద్రబాబుతో సహా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా మద్దతు తెలపాల్సి ఉంటుంది. అయితే చంద్రబాబు మధ్యంతర ఎన్నికలకు అంగీకరిస్తారా అంటే కష్టమే అంటున్నాయి రాజకీయ వర్గాలు..ఆయన అంత తేలిగ్గా దీనికి అంగీకరించే అవకాశం అయితే కనిపించడం లేదు. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు టిడిపి, జనసేన , బిజెపి కూటమి ఏకంగా 164 స్థానాలు దక్కించుకుంది.టిడిపి చరిత్రలో ఇది అతి పెద్ద విజయం..ఇంతటి ఘన విజయం దక్కడం టీడీపీకి ఇదే మొదటిసారి . దీంతో జమిలి ఎన్నికలకు వెళ్లేందుకు చంద్రబాబు అంగీకరించే అవకాశం అస్సలు లేదని తెలుస్తుంది..