జమిలి ఎన్నికల గోల: 30% మంచైతే 70% ప్రజలకు నష్టమే..?

Pandrala Sravanthi
-దేశవ్యాప్తంగా జమిలీపై చర్చ..
- ఒకే దేశం ఒకే ఎన్నిక సాధ్యమేనా.?
- బిజెపి సుస్థిరత కోసమే ఈ ఎన్నికనా.?

 ప్రస్తుతం దేశంలో ఈసీ ఇచ్చినటువంటి తేదీల ప్రకారం ఎన్నికలు జరుగుతూ ఉంటాయి.  ఒక రాష్ట్రంలో అయినా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తూ ఉంటాయి. ఇలా మన దేశంలో రెండు మూడు టర్మ్ లు ఎన్నికలు జరుగుతాయి. ఏ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు గడిస్తే ఆ రాష్ట్రంలో ఈసీ ఎన్నికలకు ఆమోదం తెలుపుతుంది. ఆ విధంగా ఎన్నికల నిర్వహిస్తూ  వస్తుంది. కానీ ఈ విధానానికి స్వస్తి పలికి ఒకే దేశం ఒకే ఎన్నిక అనే నినాదాలు అందుకుంది బిజెపి ప్రభుత్వం. ఇలా జమిలి ఎన్నికల వల్ల  లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయని కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఒకే దేశం ఒకే ఎన్నిక వల్ల నష్టం ఏంటి.. ఆ వివరాలు ఏంటో చూద్దాం.?
 అభివృద్ధిని కబలించే జమిలి:
జమిలి ఎన్నికల పేరు చెప్పగానే ప్రాంతీయ పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కానీ బిజెపి పార్టీ మాత్రం లోక్ సభలో సొంత మెజారిటీ లేకపోయినా జమిలీ ఎన్నికలు నిర్వహించాలనే నిబంధనలతో ముందుకు వెళ్తోంది. ఒకే దేశం ఒకే ఎన్నిక అనే విధానం పై పార్టీలకు అతీతంగా మద్దతు లభిస్తుందని మోడీ సర్కార్ చెబుతోంది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తవుతున్న సందర్భంగా పాలక కూటమితో బంధం పటిష్టంగా ఉందని ఇది ఐదు సంవత్సరాలు అద్భుతంగా కొనసాగుతుందని చెబుతూనే జమిలీ ఎన్నికలపై స్టేట్మెంట్స్ ఇస్తున్నాయి ప్రభుత్వం. జమిలీ ఎన్నికలు ఈ ప్రభుత్వంలోనే మొదలవుతాయని, లోక్ సభ ఎన్నికల సమయంలో బిజెపి ఇచ్చిన మేనిఫెస్టోలో ఈ అంశం కూడా ఉంది. రాష్ట్రాలు మొత్తంలో అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ ఒకేసారి జరపాలని మాజీ రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ సారధ్యంలో అత్యున్నత స్థాయి కమిటీ ఇప్పటికే సిఫార్సు చేసింది.2029 నుంచి అసెంబ్లీ పార్లమెంట్ గ్రామ పంచాయతీలకు సంబంధించి అన్ని ఒకేసారి ఎన్నికలు జరపాలని నిర్ణయం తీసుకుంది.
 
నష్టాలు:
 ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తే మాత్రం  నష్టపోయేది పేద ప్రజలే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.జమిలి ఎన్నికల వల్ల రాష్ట్రాల్లో అభివృద్ధి కుంటి పడడమే కాకుండా, సుస్థిర ప్రభుత్వాలు ఉండవు. ఏదైనా రాష్ట్రంలో  ప్రాంతీయ పార్టీ గెలిచి రెండు సంవత్సరాల తర్వాత అవిశ్వాస తీర్మానం పెడితే మాత్రం  మళ్లీ మూడు సంవత్సరాలకు మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. మూడు సంవత్సరాలలో మళ్లీ గెలిచిన అభ్యర్థులు అభివృద్ధి చేయడాన్ని పక్కన పెడతారు.  ఎందుకంటే ఉన్నదే మూడు సంవత్సరాలు దీనికోసం మనం ఎందుకు అంతగా ఖర్చు పెట్టడం అంటూ ఆలోచన చేసి అభివృద్ధిని కుంటుపడేసి వారి సంపాదనే లక్ష్యంగా పెట్టుకుంటారు. దీనివల్ల రాష్ట్రాల్లో అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రభుత్వాలు కూడా సుస్థిరంగా ఉండలేవు. అవిశ్వాస తీర్మానం పెడుతూ ప్రభుత్వాలు పడిపోతూ ఉంటాయి. ఇలా ఏది చేసినా పేద ప్రజలే నష్టపోతారు. ఏది ఏమైనా జమిలి ఎన్నికలతో ప్రాంతీయ పార్టీలను నోక్కేసి రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులు లేకుండా చేయాలని  చూస్తున్నారు  జాతీయ పార్టీల నాయకులు. ప్రజలు ఆలోచన చేసి ఎవరైతే బాగుంటుంది ఏ ఎన్నికైతే బాగుంటుందో తప్పనిసరిగా తెలియజేయాల్సిన అవసరం ఉంది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: