జమిలి ఎన్నికల గోల: హిట్లర్ పాలన రిపీట్ అవుతుందా.?
- ప్రశ్నించే గొంతులను నొక్కాడమే ఈ ఎన్నికలా.?
- హిట్లర్ పాలన చూడబోతున్నామా.?.
ప్రస్తుతం సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో ఎక్కడ చూసినా జమిలి ఎన్నికల టాపికే వినిపిస్తోంది. అసలు ఈ జమిలి ఎన్నికలు అంటే ఏంటి.. దీనివల్ల దేశానికి నష్టమా.. లాభమా అనే దానిపై చర్చ జరుగుతోంది. ఒకే దేశం ఒకే ఎన్నిక అనే నినాదం అసలు బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిందా ఇదివరకు దేశంలో జరిగిందా.. జెమిలీ ఎన్నికల వల్ల పాలన ఎలా ఉండబోతోంది అనే వివరాలు చూద్దాం.
జమిలి వణుకు :
కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే ఎన్నికలు అనే నిర్ణయం వెనుక దేశవ్యాప్తంగా విపరీతమైనటువంటి చర్చ జరుగుతోంది. 1951లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల నుంచి మొదలు 1967లో జరిగినటువంటి నాలుగవ సార్వత్రిక ఎన్నికల వరకు ఇండియాలో జమిలి ఎన్నికలు జరిగాయి. పార్లమెంటుకు,అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు నిర్వహించారు. ఇక 1972లో జరపాల్సిన ఐదవ సార్వత్రిక ఎన్నికలు 1971 లోనే జరగడంతో జమిలి ఎన్నికల ప్రక్రియ కి బ్రేక్ పడింది. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఎన్నికలు ఒకేసారి జరగడం ఆగిపోయింది. అలాంటి పద్ధతిని మళ్లీ పునరుద్ధరించాలని ప్రస్తుతం ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం పట్టుదలతో ఉంది. దీనికోసం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కొన్ని కమిటీలను కూడా వేసింది. అయితే ఈ బిల్లును వచ్చే శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ జమిలిలో పార్లమెంటు,అసెంబ్లీయే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా 100 రోజుల్లో ముగించాలి.