జమిలీ ఎన్నికలతో లాభం కంటే నష్టమే ఎక్కువా..?

Divya
•జమిలి ఎన్నికల వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ..
•ప్రాంతీయ పార్టీలకు నష్టం తప్పదు..
•కేంద్ర మరోసారి యోచన చేస్తుందా..?
తాజాగా జమిలి ఎన్నికలు అంటూ కొత్త పద్ధతిని అమలులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.  ముఖ్యంగా ఒకే నేషన్ ఒకే ఎన్నిక పద్ధతిలో ఈ జమిలి ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఈ జమిలి ఎన్నికలు నిర్వహించడం అంటే ఒకేసారి అన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ, పార్లమెంటుకు ఎన్నికలు జరుగుతాయి. అయితే ఇలా జరగడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు మరి ఈ జమిలి ఎన్నికల వల్ల లాభం ఏంటి..? కలిగే నష్టం ఏంటి.?అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
జమిలి ఎన్నికల వల్ల ఎన్నికల వ్యయం,  సిబ్బంది వినియోగం, నిర్వహణ భారం దాదాపు తగ్గుతుందని చెప్పవచ్చు.  ముఖ్యంగా ఓటింగ్ శాతం కూడా పెరుగుతుంది.  ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఓటు వేయడానికి ప్రజలు తరచూ తమ సొంత ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. దీనికి తోడు ఉత్పాదకత పెరుగుతుంది. పైగా తరచూ వచ్చే ఎన్నికల కోడ్ వంటి అడ్డంకులు తప్పడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వాలు దృష్టి సారించే అవకాశం ఉంటుంది.
నష్టాల విషయానికొస్తే.. జమిలి ఎన్నికలపై రాజ్యాంగంలో అసలు ప్రస్తావన లేదు. కాబట్టి ఇప్పటికైతే ప్రస్తుతం ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పవచ్చు. భారత్ వంటి అత్యధిక జనాభా కలిగిన దేశంలో ఒకేసారి ఎన్నికలు అంటే కష్టం మరింత ఎక్కువవుతుంది. పారదర్శకతపై అనుమానాలు కూడా కలగవచ్చు. గడువులోపే ప్రభుత్వాలు పడిపోతే జమిలీ లక్ష్యం దెబ్బతింటుంది.  అంతేకాదు అవిశ్వాసం ఎదుర్కొనే ప్రభుత్వాల విషయంలో కూడా నష్టం వాటిల్లుతుంది. జాతీయ పార్టీలకు జమిలీ ఎన్నికల వల్ల మేలు కలగవచ్చు కానీ ప్రాంతీయ పార్టీలు ఎన్నికలలో దెబ్బ తినే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఈ జమిలి నిర్వహణకు భారీ సిబ్బంది, ఈవీఎంలు  కూడా అవసరం అవుతాయి. జాతీయ అంశాల ఆధారంగా అసెంబ్లీకి కూడా ప్రజలు ఓటేస్తే ప్రాంతీయ పార్టీలు దెబ్బతింటాయి. కాబట్టి ఒకరకంగా ఇది నష్టం కలిగించవచ్చు అని చెప్పవచ్చు. మరి ప్రస్తుతం ఈ జమిలి ఎన్నికలపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: