నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 35 వేల పోస్టులకు నోటిఫికేషన్..!

Divya
గత కొన్నే ఏళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాలలో నిరుద్యోగ సమస్య వెంటాడుతూనే ఉంది. ముఖ్యంగా నిరుద్యోగుల సంఖ్య కూడా రోజురోజుకే పెరుగుతూనే ఉంది. తెలంగాణలో కంటే ఏపీలో మరింత సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఇటీవలే కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎలాంటి ఉద్యోగుల ప్రకటన చేయలేదు. అటు తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఇప్పటికి కొన్ని నెలలు కావస్తున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టలేదు. అయితే ఇప్పుడు తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగ యువతకు ఒక గుడ్ న్యూస్ తెలియజేశారు.

యాసబ్ ట్యాంక్ BFSI స్కిల్ ప్రోగ్రాంలో రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించడం జరిగింది.. డిగ్రీ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులకు ఇందులో ఉద్యోగా అవకాశాలు కల్పించడం కోసమే ఈ కోర్సును ప్రభుత్వం తీసుకువచ్చిందని ఇందులో భాగంగా స్కిల్ ప్రోగ్రాం ని కూడా ప్రారంభించామంటూ తెలిపారు.. అలాగే రాష్ట్రంలో ఉన్న అన్ని శాఖలలోని పోస్టులను కూడా భర్తీ చేస్తామని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. సుమారు 35 వేల పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని.. ఉద్యోగుల కోసం నిరుద్యోగులు విద్యార్థులు కూడా పోరాటాలు చేశారని గత పదేళ్ల టిఆర్ఎస్ పాలనలో విద్యార్థులకు చాలా అన్యాయం జరిగిందని తెలిపారు.

తెలంగాణ ఏర్పడి ఇప్పటికి పదేళ్లు అవుతున్న కూడా నిరుద్యోగం పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదంటూ తెలిపారు రేవంత్ రెడ్డి.. నిరుద్యోగుల దశ దిశ నిర్దేశాలను మార్చడానికి ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను తీసుకువస్తున్నామంటూ తెలిపారు. ఉద్యోగాలు రాక తెలంగాణ యువత ఎక్కువగా డ్రగ్స్ గంజాయి వంటి వాటికి బానిస అవుతున్నారని.. అలాంటివి చేయడం తప్పు పరిశ్రమలకు నిరుద్యోగులకు మధ్య కాస్త గ్యాప్ వచ్చింది అందుకే ఇలా జరుగుతోందని రాబోయే రోజుల్లో వీటన్నిటిని అధిగమించి మరి ముందుకు వెళ్తామంటూ తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: