గట్టు ప్రాజెక్టు నిర్మాణం దిశగా అడుగులు.. తెలంగాణ ప్రజలకు వరం..?
వారి నిర్ణయం ప్రకారం, జూరాల రిజర్వాయర్ నుంచి 3.2 కిలోమీటర్ల మేర అప్రోచ్ కెనాల్ నిర్మిస్తారు. అంతేకాదు, మాల్‌దొడ్డి వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేయనున్నారు. ఇదే ప్రాంతంలో నాలుగు పంపులు ఉపయోగిస్తూ 14.5 కి.మీ ప్రెషర్ మెయిన్స్ (పైపు లైన్లు) ద్వారా 90 రోజుల పాటు జూరాల బ్యాక్ వాటర్‌ను గట్టు ప్రాజెక్టులోకి ఎత్తిపోయడం జరుగుతుంది. ఈ ఎత్తిపోయడం జరగాలంటే గట్టు ప్రాజెక్టు వాటర్ స్టోరేజీ కెపాసిటీని 1.3 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు పెంచాల్సి ఉంటుంది. ఆ విషయంలో కూడా ఇరు రాష్ట్రాల అధికారులు సరైన చర్యలు తీసుకుంటారు.
ఆపై గ్రావిటీ గుండా తెలంగాణలోని 33 వేల ఎకరాలు, కర్ణాటకలో 95 వేల ఎకరాల ఆయకట్టుకు వాటర్ సప్లై చేస్తారు. అంటే టోటల్ 1.28 లక్షల ఎకరాలకు నీరు అందుతుంది. ఈ వాటర్ సప్లై కోసం 45.97 కిలో మీటర్ల మేర గ్రావిటీ కెనాళ్లను కన్‌స్ట్రక్ట్ చేస్తారు. ఈ ప్రాజెక్టు కాస్ట్ సుమారు రూ.2 వేల కోట్లు అవుతుందని అంచనా. ఈ డబ్బును ఉమ్మడిగా రెండు రాష్ట్రాలు భరిస్తాయా లేదా అనేది తెలియాల్సి ఉంది. బుధవారం ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా ముగ్గురు మంత్రుల బృందం గట్టు ప్రాజెక్టును విజిట్ చేయడం జరిగింది. దాంతో ఈ ప్రాజెక్టు రెండు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది.
కొన్నేళ్ల క్రితం నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలోని ర్యాలంపాడు రిజర్వాయర్ నుంచి వాటర్ లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. అందుకే రూ.553 కోట్లతో 1.3 టీఎంసీల సామర్థ్యంతో గట్టు ప్రాజెక్టును లాంచ్ చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కారణంగా ఏ ప్రాంత ప్రజలకు ఇబ్బంది కలగకుండా అంతర్రాష్ట్ర ప్రాజెక్టును ప్రతిపాదించారు. దీనివల్ల ఉమ్మడి పాలమూరు జిల్లాకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు.