చంద్రబాబుకు ఎవరైనా ఈ మాట చెప్పండి.... ఆయన్ను మార్చండి...!
- పవన్ పావుగంట తో ఫటాపట్ ప్రసంగాలు
- జనాల మూమెంట్ కు తగ్గట్టుగా బాబు ఎప్పటకి మారతారో ?
- ( అమరావతి - ఇండియా హెరాల్డ్ ) .
ఎట్టకేలకు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు 4.0 పాలన ఇప్పుడు కొనసాగుతోంది. చంద్రబాబు ఇన్నేళ్ల అనుభవం ఉన్నా.. ఈ సారి కూటమి కట్టి మరీ నాలుగో సారి ముఖ్యమంత్రి అయినా ఆయన పంధాలో ఏ మాత్రం మార్పు రావడం లేదన్న చర్చలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ప్రసంగాలలో పదును లేదని.. పస లేదన్న విమర్శలు మళ్లీ స్టార్ట్ అయ్యాయి. చంద్రబాబు మీడియా ముందుకొస్తే పూనకం వచ్చేస్తుంది. దాని వల్ల సుమారు గంటకు తగ్గకుండా పాఠం అప్పగిస్తారు. అదంతా మీడియా వాళ్ళు రాయలేరని, టీవీ లో చూపినా అంతంత సేపు వినలేరనీ ఆయనకి ఎవరూ చెప్పలేరా? అన్న ప్రశ్నలే ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
కేవలం ప్రెస్ మీట్లు మాత్రమే కాదు ... చంద్రబాబు పెట్టే పబ్లిక్ మీటింగ్ కూడా అలానే వుంటుంది. స్టేజ్ కింద జనం వెళ్ళిపోయినా ఎదురుగా టీవీ కెమెరాలకు ఆయన చెప్పేస్తూ ఉండడం చాలా మార్లు చూశామని విలేఖర్లు గగ్గోలు పెడుతుంటారు. ప్రెస్ మీట్ లో కూడా అదే పంథా ఆయనది. ఇక ఈ వారంలో డిప్యూటీ సీఎం రెండు సార్లు మీడియా ముందుకు వచ్చారు. పావు గంటకి అటు ఇటు అంతే. మరి చంద్రబాబు మాట్లాడేందుకు మాత్రం అతనికి నాలుగు రెట్లు. ఎందుకో మరి ? అన్నది ఎవ్వరికి అర్థం కాని ప్రశ్న. చంద్రబాబు ఈ స్పీడ్ యుగంలోనూ నత్త తో పోటీ పడుతున్నట్టు మాట్లాడడం చాలా మందికి నచ్చడం లేదు. జనం షార్ట్స్, రీల్స్ కాలంలో ఉన్నారు. లీడర్లు చాలా వెనుకబడి ఉండిపోయారు అన్న టాక్ కూడా వినిపిస్తోంది.