పేర్ని కిట్టుకు సీన్ లేదని జగన్‌కు అర్థమైపోయిందా...?
- కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి పేర్ని నాని
- మొన్న ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుని కొడుక్కి సీటు ఇప్పించుకున్న నాని
- రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన నాని
- ఎన్నికల్లో మంత్రి కొల్లు రవీంద్ర చేతిలో చిత్తుగా ఓడిన నాని కొడుకు పేర్ని కిట్టు
- కిట్టు కు సీన్ లేదని జగన్ అర్థమై తిరిగి నానిని రంగంలోకి దింపిన జగన్
- ( కృష్ణా - ఇండియా హెరాల్డ్ ) .
మాజీ మంత్రి వైసిపి కీలక నేత పేర్ని నానికి పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద షాకే ఇచ్చారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పేర్ని నాని హవా ఒక రేంజ్ లో కొనసాగింది. తొలి ముడేళ్ల పాటు జగన్ క్యాబినెట్లో పేర్ని నాని మంత్రిగా ఉన్నారు. వైసీపీ తరఫున మీడియా ముందుకు వచ్చి బలమైన వాయిస్ వినిపించాలన్నా ... అదిరిపోయే సెటైర్లు వేయాలన్న పేర్ని నాని ముందు వరుసలో ఉంటారు. మూడేళ్ల పాటు మంత్రిగా ఉన్న నాని మంత్రి పదవిని జగన్ ఆ తర్వాత తీసేసారు. ఇక ఈ ఎన్నికలకు ముందు మరోసారి నాని పోటీ చేయాలని అనుకున్న కుటుంబ సభ్యుల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉండడంతో జగన్ దగ్గర రిక్వెస్ట్ చేసుకుని తాను ఎన్నికలలో పోటీ చేయనని తన కొడుకు పేర్ని కిట్టుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని వేడుకున్నారు.
జగన్‌కు ఇష్టం లేకపోయినా నాని ఒత్తిడి తో కిట్టుకే బందరు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు. ఆ ఎన్నికలలో పోటీ చేసిన పేర్ని కిట్టు ప్రస్తుత తెలుగుదేశం పార్టీ మంత్రి కొల్లు రవీంద్ర చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయారు. అయితే కిట్టు కి రాజకీయంగా అంత సీన్ లేదని డిసైడ్ అయిన జగన్ ఇప్పుడు పేర్ని నాని రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పినా ... తిరిగి ఆయనను తెరమీదకు తీసుకువచ్చారు. తాజాగా కృష్ణ జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడిగా పేర్ని నానిని జగన్ నియమించారు. వచ్చే ఎన్నికలలో మచిలీపట్నం నుంచి పేర్ని నానినే మరోసారి పోటీ చేయించే ఆలోచనలో జగన్ ఉన్నారని ... అందుకే రాజకీయాలనుంచి దూరంగా ఉంటానని చెప్పినా ... నానికి కీలకమైన పదవి కట్టబెట్టారని వైసిపి వర్గాలలో ప్రచారం జరుగుతుంది.