కేటీఆర్‌ తీవ్ర అస్వస్థత..తెలంగాణ భవన్‌ దగ్గర ఉద్రిక్తత ?

Veldandi Saikiran
బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావుకు ఊహించని పరిణామం ఎదురైంది. బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తనకు మొన్నటి నుంచి ఆరోగ్యంగా బాగాలేదని అధికారిక ప్రకటన చేశారు బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. హైడ్రా బాధితులకు అండగా పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ న్యాయవిభాగం అండగా ఉంటుందని సోషల్ మీడియాలో ప్రకటించారు కేటీఆర్.
తెలంగాణ భవన్ కి వస్తున్న హైడ్రాబాధితులకు అండగా నిలబడాలని పార్టీ నాయకులకు, పార్టీ శ్రేణులకు సూచనలు చేశారు బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.  గత 36 గంటలుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారట కేటీఆర్.   మొన్న రాత్రి నుంచి జ్వరంతో, తీవ్ర దగ్గు జలుబుతో బాధపడుతున్నట్లు తెలిపారు బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.   ఈ తరుణంలోనే... డాక్టర్ల సూచన మేరకు యాంటీ వైరల్, యాంటి బయోటిక్స్ మందులు తీసుకుంటున్నట్లు తెలిపడం జరిగింది.
ఇది ఇలా ఉండగా... ఇవాళ ఉదయం నుంచి తెలంగాణ భవన్ కు భారీ స్థాయిలో హైదరాబాద్ వాసులు చేరుకుంటున్నారు. హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో హైదరాబాద్ ప్రజలు తెలంగాణ భవన్ కు వస్తున్నారు. అన్యాయంగా రేవంత్ రెడ్డి సర్కార్ తమ ఇండ్లను కూల్చి వేస్తుందని.. బాధపడుతున్నారు హైదరాబాద్ ప్రజలు. ముఖ్యంగా మూసి పరివాహక ప్రాంతాలలో ఉన్నవారు ఇవాళ తెలంగాణ భవన్ కు వేల సంఖ్యలో రావడం జరిగింది.
ఎలాగైనా కెసిఆర్ ఏ తమను కాపాడాలని అందుకే తెలంగాణ భవన్ కు వస్తున్నామని వివరించారు. అయితే భారీ సంఖ్యలో బాధితులు... తెలంగాణ భవన్ కు చేరుకున్న తరుణంలో కేటీఆర్ ఈ ప్రకటన చేశారు. తనకు ఆరోగ్యం బాగాలేదని మరో 36 గంటల తర్వాత బయటకు వస్తానని కేటీఆర్ వెల్లడించారు. గులాబీ నేతలు హైదరాబాధితుల కోసం పని చేస్తారని కూడా వివరించారు బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: