జగన్ పక్కన పెట్టడంతో రూటు మార్చిన మోహన్ బాబు!
అయితే మంచు మోహన్ బాబు ప్రస్తుతం సినిమాల పరంగా కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్నాడు అని చెప్పుకోవాలి. మరోవైపు రాజకీయంలో కూడా వేలు పెడుతూ, నేను కూడా ఉన్నాను! అని ప్రజలకు గుర్తు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. నందమూరి తారక రామారావు గారు టిడిపిని నెలకొల్పిన నాటి నుండి మోహన్ బాబు టిడిపి సానుభూతిపరుడుగా పనిచేసేవాడు. ఇక తర్వాత చంద్రబాబు హయాంలో కూడా అదే జరిగింది. ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయాలు చాలా మారిపోయాయి. 2019 వ సంవత్సరంలో వైయస్ జగన్ ఆంధ్రప్రదేశ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇక అక్కడి నుండే మోహన్ బాబు యూటర్న్ తీసుకొని వైసిపి సానుభూతిపరుడుగా మారడం జరిగింది. ఈ క్రమంలో జగన్ కి తన మద్దతుని కూడా తెలియజేశాడు.
అయితే ఏం జరిగిందో తెలియదు కానీ, జగన్ మాత్రం మోహన్ బాబు మద్దతుని తలకు ఎక్కించుకోలేదు. మోహన్ బాబు కి ఎటువంటి పాత్రని ఇవ్వదలుచుకోలేదు. దాంతో బాబుకు మండిందేమో తెలియదు కానీ, తాజాగా టిడిపి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో, మోహన్ బాబు మరలా బాబు పంచన చేరాడు. ఈ క్రమంలోనే తాజాగా మోహన్ బాబు, సీఎం చంద్రబాబు ని కలిసి పుష్ప గుచ్చాన్ని ఇస్తూ మరి తన మద్దతుని తెలియజేశాడు. ఆ మధ్య తిరుమల లడ్డు ప్రసాదం వ్యవహారంలో కూడా మోహన్ బాబు చంద్రబాబుకే మద్దతు ప్రకటించాడు. ఒక విషయం ఏదైనాప్పటికీ, మోహన్ బాబు జిత్తుల మారి నక్క అని ఓవర్గం వారు విమర్శిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయం పైన మీ అభిప్రాయం ఏమిటో కింద తెలియజేయండి!