టీడీపీ ఎమ్మెల్సీ క్యాండెట్లుగా రాజా - రాజ‌శేఖ‌ర్‌... వీళ్ల బ్యాక్‌గ్రౌండ్ ఇదే..!

RAMAKRISHNA S.S.
ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి కృష్ణ - గుంటూరు జిల్లాలు మరియు ఉభ‌య గోదావ‌రి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను చంద్రబాబు సోమవారం ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కృష్ణ - గుంటూరు జిల్లాల అభ్యర్థిగా గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేరును తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికే ఖరారు చేశారు. ఇక ఉభయగోదావరి జిల్లాల అభ్యర్థి ఎంపికపై కసరత్తులు జరుగుతున్న కోనసీమకు చెందిన పెరాబత్తుల రాజశేఖర్ పేరు ఖరారు అయినట్టు తెలుస్తోంది. ఇక ఆలపాటి రాజా విషయానికి వస్తే తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా ఉన్నారు.

ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు ఇటీవల జరిగిన ఎన్నికలలో పోటీ చేసే అవకాశం లభించలేదు. ఆ స్థానాన్ని జనసేనకు చెందిన మంత్రి నాదెండ్ల మనోహర్ కు కేటాయించడంతో ఆలపాటి రాజా తన సీటు త్యాగం చేయాల్సి వచ్చింది. దానికి ప్రతిఫలంగానే ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్ దక్కబోతుంది. ఇక కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గంలోని ఐ పోలవరం మండలానికి చెందిన పేరాబత్తుల రాజశేఖర్ గతంలో ఆ మండలానికి ఎంపీపీగా .. జడ్పిటిసిగా పనిచేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు కార్యక్రమాల పర్యవేక్షణ కమిటీ సభ్యుడుగా కూడా వ్యవహరించారు. ఇటీవల ఎన్నికలలో కాకినాడ రూరల్ సీటు ఆశించారు.

అయితే ఆ సీటు జనసేనకు కేటాయించడంతో రాజశేఖర్ కు ఎమ్మెల్యే అవకాశం రాలేదు. ఇప్పుడు ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ఖాయం అని జరుగుతోంది. ఉభయగోదావరి జిల్లాల పట్టబద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాపు లేదా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారికి అవకాశం ఇవ్వాలని తెలుగుదేశం భావించింది. మాజీ మంత్రి కే.ఎస్ జవహర్ తో పాటు పలువురు పేర్లు పరిశీలించింది. అయితే ఆ రెండు ఉమ్మడి జిల్లాలలో సంఖ్యాపరంగా బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన రాజశేఖర్ కు అవకాశం ఇచ్చే బాగుంటుందని చంద్రబాబు నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp

సంబంధిత వార్తలు: