క్రికెట్ ను చెడుగుడు ఆడిన రాయుడు.. రాజకీయాల్లో రాణించలేకపోయాడే.?
-క్రికెట్ లో తెలుగోడి సత్తా చూపించాడు..
- అంబటి రాయుడు రాజకీయాల్లో సక్సెస్ అవుతాడా..
సినిమా రంగంలో కానీ క్రికెట్ రంగంలో కానీ ఎంతో ఫేమస్ అయిన వ్యక్తులు ఎక్కువగా రాజకీయాల్లోకి వెళుతుంటారు.కొంతమందికి ఏ రంగంలోకి వెళ్లిన అన్ని కలిసి వస్తాయి. కానీ కొంతమందికి మాత్రం ఏదో ఒక రంగమే సక్సెస్ ఇస్తుంది. అలా క్రికెట్లో సక్సెస్ఫుల్ క్రికెటర్ గా పేరు తెచ్చుకున్న అంబటి రాయుడు రాజకీయాల్లో మాత్రం కాస్త సక్సెస్ కాలేకపోతున్నాడు. క్రికెట్ లో బ్యాట్ పట్టినంత ఈజీగా రాజకీయాల్లో బ్యాట్ పట్టడం ఉండదని కాస్త తొందరగానే తెలుసుకున్నాడు. అలాంటి అంబటి రాయుడు క్రికెట్,రాజకీయ జీవితం గురించి కొన్ని విషయాలు చూద్దాం.
క్రికెట్ నుంచి రాజకీయాల్లోకి :
అంబటి రాయుడు తన మొదటి క్రికెట్ ను 16 సంవత్సరాల వయసులో హైదరాబాదులో ప్రారంభించాడు. ఆ తర్వాత 2004లో ఐసీసీ అండర్ 19 క్రికెట్ కప్ లో ఇండియా అండర్-19 జట్టుకు బాధ్యత వహించాడు. తన ప్రతిభను కనబరిచి సీనియర్ జట్టులోకి అరంగేట్రం చేశాడు. 2012లో మొదటిసారిగా భారత జట్టులో చోటు దక్కించుకొని అద్భుతమైనటువంటి పర్ఫామెన్స్ చూపించాడు. 2013 జూలైలో జింబాబ్వే తో జరిగిన మ్యాచ్ లో అంతర్జాతీయ స్థాయిలో అరంగేట్రం చేశాడు అంబటి రాయుడు. తన క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులు, రివార్డులు సాధించినటువంటి అంబటి రాయుడు 2023 మే 28 ఐపీఎల్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. అలాంటి అంబటి రాయుడు 2023లోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి డిసెంబర్ 28,2023లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. గుంటూరు పార్లమెంటు స్థానం ఆశించి పార్టీలో చేరినటువంటి అంబటి రాయుడు ఆ తర్వాత పార్టీలో జరిగినటువంటి కొన్ని విషయాల వల్ల తొమ్మిది రోజులకే పార్టీ నుంచి నిష్క్రమించబడ్డాడు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు సైలెంట్ గా ఉన్న ఆయన 2024 జనవరి 10న జనసేన పార్టీలో చేరాడు. అలా ఆ పార్టీ విజయంలో ముఖ్యమైన పాత్ర పోషించినటువంటి అంబటి రాయుడు ప్రస్తుతం జనసేన పార్టీలోనే కొనసాగుతున్నాడు. అయితే ఆయన క్రికెట్లో సాధించినన్ని విజయాలు రాజకీయాల్లో మాత్రం సాధించలేకపోయాడు అని చెప్పవచ్చు.