లడ్డూ పంచాయితీ: జగన్ కు భారతి కండీషన్లు ?
వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తిరుమల శ్రీవారి లడ్డులో జంతువుల కొవ్వును కలిపారని ఆయన బాంబు పేల్చారు. దీంతో అప్పటి నుంచి రచ్చ కొనసాగుతోంది. వాస్తవంగా ఈ రిపోర్టు జూన్ మాసంలో... చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ లో బయటపెట్టారు. అయితే దీన్ని క్యాచ్ చేసిన వైసీపీ పార్టీ... జూన్లో ఎందుకు ఈ విషయాన్ని బయట పెట్టలేదని మండిపడుతోంది. అప్పుడే చెప్పుంటే... నిందితులు ఎవరో తేలిపోయేదని కూడా జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు.
అయితే ఈ వివాదం నేపథ్యంలోనే తిరుమల పర్యటనకు జగన్మోహన్ రెడ్డి రావాలని నిర్ణయించుకున్నారు. ఇంతలోనే తిరుమల డిక్లరేషన్ పైన సంతకం పెట్టాలని టిడిపి వాదిస్తూ వస్తోంది. అయితే డిక్లరేషన్ పైన జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టబోడని వైసిపి స్పష్టం చేసింది. చివరికి తిరుమల పర్యటనను జగన్మోహన్ రెడ్డి రద్దు చేసుకునే వరకు ఈ పంచాయతీ వచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుండి... తన పర్యటనను రద్దు చేసుకోవడం పట్ల టిడిపి రకరకాలుగా. కౌంటర్ ఇస్తోంది.
అదే రోజున కోర్టులో కేసును తప్పించుకొని తిరుమల పర్యటన పేరుతో... జగన్ ఎస్కేప్ అయిపోయాడని కొంతమంది టిడిపి నేతలు ఆరోపణలు చేశారు. ఇక సోమిరెడ్డి లాంటి నేతలు మాత్రం... చాలా డిఫరెంట్ గా స్పందించారు. తిరుమల డిక్లరేషన్ పైన జగన్ మోహన్ రెడ్డి సంతకం పెడితే... వైయస్ భారతి... జగన్మోహన్ రెడ్డిని ఇంట్లోకి కూడా రానివ్వదని... సెటైర్లు పేల్చారు. జగన్మోహన్ రెడ్డికి ఇంట్లో వైయస్ భారతి ప్రత్యేకమైన కండిషన్లు పెట్టిందని కూడా ఆయన ఆరోపణలు చేశారు. దీంతో.. తిరుమల పర్యటనను సోమిరెడ్డి రద్దు చేసుకున్నారని.... వైయస్ జగన్మోహన్ రెడ్డికి... చురకలాంటించారు.