లడ్డూ వివాదం: ఏం బాబు, మీ నీచ రాజకీయాలకు హద్దే లేదా.. ఛీకొడుతున్నా..?
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ అయ్యిందంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే అయితే సుప్రీంకోర్టు బాబు చేసిన ఈ వ్యాఖ్యలను సపోర్ట్ చేయడానికి ఎలాంటి సాక్షాలు లేవని మండిపడింది. సీఎం హోదాలో కోట్ల మంది హిందూ ప్రజల మనోభావాలను గాయపరిచేలాగా చంద్రబాబు వ్యవహరించాలని కూడా చివాట్లు పెట్టింది. ఇక అప్పటినుంచి బాబు నీచ రాజకీయాలకు హద్దే ఉండదా అని హిందూ ప్రజలు ఛీ కొడుతున్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి, ఏ అసత్యం మాట్లాడినా సత్యం అయిపోతుందా బాబు అంటూ ఏకిపారేస్తున్నారు.
రాజకీయాల్లో దేవుడిని ఉపయోగించుకొని ప్రయోజనాలు పొందాలనుకుంటే అంతకంటే మహా పాపం మరేది ఉండదు అంటూ చంద్రబాబుకి బుద్ధి చెబుతున్నారు. అబద్ధాలను నిజం చేయాలని చూస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చంద్రబాబును హెచ్చరిస్తున్నారు. పరమ పవిత్రమైన శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పడం వల్ల ఆలయానికి ఒక మచ్చ ఏర్పడింది. అంతేకాదు చంద్రబాబు కోట్లాది భక్తుల మనోభావాలు దారుణంగా దెబ్బతీశారు.
మాజీ సీఎం జగన్ పై బురదజల్లే ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు స్వార్థ, కుటిల, కుతంత్ర రాజకీయాలతో బాలాజీ లడ్డూలకు మలినం అంటించి పెద్ద తప్పు చేశారని చాలామంది విమర్శిస్తున్నారు. ఆ ఏడుకొండలవాడు ఇలాంటి నీచపు పనులు చేసే వారిని ఊరికే వదిలేస్తాడా అని అంటున్నారు. సాక్షాత్తు శ్రీవారే సుప్రీం కోర్టు ధర్మాసనంతో చంద్రబాబు రెండు చెంపలూ వాయించినట్లు వ్యాఖ్యలు పలికించారని బలంగా విశ్వసిస్తున్నారు.
టీటీడీ ఈవో శ్యామలరావు జంతువుల కొవ్వు కలిసిన నెయ్యి వాడలేదని చెబుతుంటే, చంద్రబాబు మాత్రం తానే మొత్తం చూసినట్టు కలుపుతుంటే తాను అక్కడే ఉన్నట్టు ఆరోపిస్తున్నారు అలాంటప్పుడు దీన్ని ఎందుకు ఆయన ఆపలేదు అని చాలామంది నిలదీస్తున్నారు. చంద్రబాబు దురాలోచనతో హిందువులను బాధపెడుతున్నారని మండిపడుతున్నారు. చంద్రబాబు సిట్ ఏర్పాటు చేశారు కదా ఆ అధికారులు అందరూ ఆయన మాట వినే వారే అట. ఆయన రిపోర్ట్ ఎలా ఇవ్వాలో సెట్ అధికారులకు తెలిపితే వారు అలాగే ఇస్తారట.
సుప్రీంకోర్టు కూడా సిట్ విచారణ ఎందుకు అని ఏపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. బాలాజీ లడ్డూలు తయారు చేసే నెయ్యిలో ఎలాంటి జంతువుల కొవ్వు మిక్స్ అవ్వలేదు కాబట్టే తాము సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతున్నట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. ప్రసాదంలో కల్తీ చేసి ఉంటే తాము కచ్చితంగా సర్వనాశనం అవుతామని, రక్తం కక్కుకుని చచ్చిపోతామని వారు అంటున్నారు వారి మాటలు బట్టి చూస్తుంటే వైసీపీ నేతలు కల్తీని లడ్డూల తయారీలో వాడినట్టు అస్సలు అనిపించడం లేదు. ఇక సుప్రీంకోర్టు కూడా ఆధారాలు చూపించాలని అడగడం, టీడీపీ ఎలాంటి ఆధారాలు చూపించలేకపోవడంతో చంద్రబాబు అబద్ధాలు బట్టబయలు అయ్యాయి.
ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష అంటూ నానా హడావుడి చేశారు అసలు నిజం ఏంటో తెలుసుకోకుండా ఆయన ఒక బకరా అయిపోయారని వైసీపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.