రేవంత్ కి హైడ్రా తలనొప్పి? అలా చేస్తే మళ్లీ ఇక తిరుగుండదా..!

Chakravarthi Kalyan

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వరుసగా రెండు సార్లు అధికారం చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్ర పరిస్థితుల నేపథ్యంలో ఏపీ కాస్త రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. దాంతో ప్రత్యేక రాష్ట్రానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘెర అపజయాన్ని చూడాల్సి వచ్చింది. అలా రెండు పర్యాయాలు కూడా కాంగ్రెస్ పార్టీ కనీసం గట్టి పోటీని కూడా ఇవ్వలేకపోయింది.



గతం గతం అన్నట్లు దశాబ్ద కాలం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టింది. తిరుగులేని మెజార్టీ సాధించి కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. రెండు పర్యాయాలు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ను మట్టి కరిపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే దాని ముమ్మాటికి ఉన్నది రేవంత్ రెడ్డే అని చెప్పొచ్చు.


ఎప్పుడైతే టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరారో అప్పటి నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఊపు వచ్చినట్లయింది. ఆ వెంటనే ఆయనకు పీసీసీ పదవి దక్కడం మరింత కలిసి వచ్చింది. కనుమరుగైన పార్టీ కాస్తా మరోసారి ఊపిరి పీల్చుకున్నంత పనైంది. పార్టీ గెలుపును నెత్తిన వేసుకున్న రేవంత్ అదే లక్ష్యంతో ముందుకు సాగారు. రాష్ట్రం మొత్తం చుట్టి వచ్చారు. చివరకు అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. లోక్ సభ ఎన్నికల్లోను చేసిన ఛాలెంజ్ ప్రకారం ఒక్క ఎంపీ సీటు కూడా బీఆర్ఎస్ కు దక్కకుండా అడ్డుకోగలిగారు.


ఇంత వరకు బాగానే ఉన్న రేవంత్ తీసుకున్న ఓ నిర్ణయం ఆయన మనుగడనే ప్రశ్నార్థకం చేసింది. అదే హైడ్రా. ఇప్పుడు రేవంత్ కి ప్రాణ సంకటంగా మారింది. మొదట్లో ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చినా.. ఎప్పుడైతే నిరుపేద, మధ్య తరగతి ఇళ్లను కూల్చివేస్తుందో ఒక్కసారిగా వ్యతిరేకత మొదలైంది. వందలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. దీంతో వారు ప్రభుత్వంపై శాపనార్థాలు పెడుతున్నారు.


మొత్తానికి విజయవంతంగా నడుస్తున్న ప్రభుత్వానికి హైడ్రా పెద్ద తలనొప్పిగా తయారైంది. ఇప్పటికైనా ప్రజల రోదనలు విని రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గుతారా అక్రమాలను వదిలేది లేదని అలానే ముందుకు సాగుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: