తిరుమల లడ్డు వివాదం : చిక్కుల్లో పవన్.. ఇక పూటకో వేషం మార్చకు ?
తిరుమల శ్రీవారి లడ్డు వివాదంలో... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్.. ఇద్దరు అడ్డంగా దొరికిపోయారు. సుప్రీంకోర్టు ముందు.. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ అయినట్లు ఎలాంటి రుజువులు లేకపోవడంతో... జడ్జ్ సీరియస్ అయ్యారు. రుజువులు లేకుండా ఎలా ఆరోపణలు చేస్తారని మండిపడ్డారు సుప్రీంకోర్టు న్యాయవాది. హిందువుల మనోభావాలతో ఆడుకుంటారా... అంటూ కూటమి ప్రభుత్వం పై మొట్టికాయలు వేసింది సుప్రీంకోర్టు.
అయితే సుప్రీంకోర్టు తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ వివాదం పై చేసిన వ్యాఖ్యలను నేపథ్యంలో.. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు. హిందుత్వవాదమని రెచ్చిపోయి మాట్లాడిన పవన్ కళ్యాణ్.. ఈ లడ్డు అంశంలో తమిళ కార్తి అలాగే నటుడు ప్రకాష్ రాజును.. టార్గెట్ చేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాగే 11 రోజుల దీక్ష చేస్తున్నట్లు.. హిందుత్వవాదులను రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేశారు పవన్ కళ్యాణ్.
వాస్తవం ఏంటో తెలియకుండా... తిరుమల శ్రీవారి లడ్డు విషయాన్ని బాగా హైలెట్ చేశారు. ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన టిడిపి కూటమి ప్రభుత్వం... పవన్ కళ్యాణ్ ను ముందు పెట్టి హిందుత్వ వాదాన్ని.. గట్టిగా పట్టుకుంది. గత పది రోజులుగా తిరుమల శ్రీవారి లడ్డు వివాదాన్ని రచ్చ రచ్చ చేసింది. తీరా సుప్రీంకోర్టు వరకు పంచాయతీ వెళ్లేసరికి.. తోక ముడిచింది కూటమి ప్రభుత్వం.
అయితే కూటమిలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక్కరే ఇప్పుడు... ఈ విషయంలో బలయ్యారని చెప్పవచ్చు. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ అయిందని నిజాలు తెలుసుకోకుండా... ప్రెస్ మీట్ లు అలాగే దీక్షలు చేస్తూ రెచ్చిపోయారు. కానీ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో.. వైసిపి ఒక ఆట ఆడుకుంటుంది. పూటకో మాట.. రోజుకో వేషం వేయడం మానుకో అంటూ... వైసిపి ట్రోలింగ్ చేస్తోంది. మరి దీనిపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.