అధిష్టానంపై రేవంత్ రెడ్డి తిరుగుబాటు..మీకు అన్ని చెప్పి చేయాలా?

Veldandi Saikiran
తెలంగాణ రాష్ట్రంలో బుల్డోజర్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. పొద్దున లేస్తే చాలు కూల్చివేతలకు అధికారులు రంగంలోకి దిగుతున్నారు. హైదరాబాదులో మొన్నటి వరకు హైడ్రా హడావిడి చేసి రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయేలా చేసింది. ఇక ఇప్పుడు మూసి సుందరీ కరణ పేరుతో...  మూసి పరివాహక ప్రాంతాలలో ఉన్న ఇండ్లను కూల్చేందుకు రేవంత్ రెడ్డి రంగం సిద్ధం చేశారు.  ఇప్పటికే ఆర్ బి ఎక్స్ అనే రెడ్ మార్కులు పెట్టి ఇండ్లను కూల్చేందుకు నిర్ణయం తీసుకున్నారు.
 

అయితే దీనిపై మూసి పరివాహక ప్రాంతాలలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది  తమ ఇండ్లను ఎలా కూలుస్తారని అక్కడి ప్రజలు మండిపడుతున్నారు. నోటితో చెప్పరాని బూతులతో... రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు ప్రజలు. అయితే దీనిపై చాలామంది కాంగ్రెస్ నేతలు.. ఢిల్లీ హై కమాండ్ కు ఫిర్యాదు చేశారట. రేవంత్ రెడ్డి మంత్రులకు చెప్పకుండానే హైడ్రా అలాగే, మూసి కూల్చివేతలను  జరిపిస్తున్నారని నేతలందరూ ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
 ఇలాగే రేవంత్ రెడ్డి వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీకే నష్టం వాటిల్లుతుందని చాలామంది అధిష్టానానికి ఫిర్యాదు చేశారట.  దీంతో మొన్న సోమవారం రాత్రి ఢిల్లీకి హుటా హుటన రేవంత్ రెడ్డి వెళ్లారు.ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పై మొట్టికాయలు వేశారట రాహుల్ గాంధీ. తమకు, కాంగ్రెస్ మంత్రులకు... ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇలా కూల్చివేతలు ఎందుకు చేస్తున్నావని కాంగ్రెస్ అధిష్టానం ఫైర్ అయిందట.
 అయితే దీనిపై చాలా స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చారట సీఎం రేవంత్ రెడ్డి. వాళ్లకు చెప్పి చేయాల్నా ప్రతిదీ... అంటూ రెచ్చిపోయి మాట్లాడారట. అధిష్టానాన్ని లెక్కచేయకుండా... వ్యవహరించారట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీంతో కాంగ్రెస్ అధిష్టానం చాలా షాక్ అయిందట. ఇలాంటి ముఖ్యమంత్రి తమకు అవసరం లేదని ఓ నిర్ణయానికి వచ్చిందట కాంగ్రెస్ అధిష్టానం. దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో... ఇప్పుడే ముఖ్యమంత్రిని మార్చడం మంచిది కాదని భావిస్తోందట. ఎన్నికలు పూర్తికాగానే రేవంత్ రెడ్డి పదవిని తీసేయాలని అనుకుంటున్నారట.  దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: