ఆ రెండు సినిమాలే చరణ్ ను స్టార్ గా నిలబెట్టాయా.. ఆ మూవీలో యాక్టింగ్ అదుర్స్!

Reddy P Rajasekhar
చిరంజీవి కొడుకుగా రామ్ చరణ్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినా తక్కువ సమయంలోనే తన యాక్టింగ్ స్కిల్స్ తో మంచి పేరును సొంతం చేసుకున్నారు. చిరుత సినిమాతో తొలి సక్సెస్ ను ఖాతాలో వేసుకున్న రామ్ చరణ్ మగధీర సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. మగధీర సినిమాలో స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కాలభైరవ పాత్రకు తన నటనతో రామ్ చరణ్ ప్రాణం పోశారనే చెప్పాలి.
 
రామ్ చరణ్ యాక్టింగ్ స్కిల్స్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆరెంజ్ సినిమా కమర్షియల్ గా ఫ్లాపైనా ఈ సినిమాలో సైతం చరణ్ అదిరిపోయే నటనతో మెప్పించారు. రచ్చ, నాయక్ సినిమాలు చరణ్ మాస్ ఇమేజ్ ను ఎన్నో రెట్లు పెంచేశాయి. తుఫాన్ సినిమా నిరాశకు గురి చేసినా ఎవడు సినిమాతో చరణ్ సత్తా చాటారు. గోవిందుడు అందరివాడేలే, బ్రూస్ లీ సినిమాలు సైతం నటుడిగా చరణ్ కు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
 
అయితే కమర్షియల్ గా మాత్రం ఈ సినిమాలు అంచనాలను అందుకోలేదు. అయితే రామ్ చరణ్ ప్రతి సినిమాలో ఒకేలా యాక్ట్ చేస్తున్నాడని కామెంట్లు చేసిన వాళ్లకు చెక్ పెట్టేలా రంగస్థలం సినిమాలో అద్భుతమైన యాక్టింగ్ తో చెక్ పెట్టారు. ఈ సినిమాలో రామ్ చరణ్ నటించిన కొన్ని సీన్లలో నటనను ప్రేక్షకులు సులువుగా మరిచిపోలేరనే సంగతి తెలిసిందే.
 
రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సాంగ్ కు యూట్యూబ్ లో 27 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ మ్యూజిక్ లో నంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్ అవుతుండటం గమనార్హం. గేమ్ ఛేంజర్ సినిమా రామ్ చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రామ్ చరణ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: