ఇరాన్ ఇజ్రాయెల్ దాడులు.. మనం ఎవరి వైపు ఉన్నామంటే..

Chakravarthi Kalyan

ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్లు దాడి చేసి ఇజ్రాయెల్ పౌరులను బంధీలుగా గాజాకు తీసుకెళ్లారు. ఇది గతేడాది అక్టోబరు 7న జరిగింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభం అయింది. హమాస్ కు మద్దతుగా ఉండే లెబనాన్ దేశంలోని హెజ్బొల్లా గ్రూప్, యెమెన్ లోని హైతీ తిరుగుబాటు దాడులతో ఈ యుద్ధం కాస్తా ఇజ్రాయెల్, లెబనాన్,ఇరాన్ దేశాలకు విస్తరించింది.


ఇక మంగళవారం.. ఇరాన్ ఇజ్రాయెల్ పై చేసిన భీకర మిస్సైల్స్ దాడితో ఒక్కసారిగా పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకొని ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇజ్రాయెల్, ఇరాన్ మిత్ర దేశాల మధ్య ఇటీవల కాలంలో దాడుల తీవ్రత విస్తరిస్తూ వస్తోంది. ఇలానే కొనసాగితే ఈ దాడులు అరబ్ దేశాలు, అమెరికా దేశాలకు విస్తరించే అవకాశం ఉంది. ఏప్రిల్ లో ఇరాన్ ఇజ్రాయెల్ పై మిస్సైల్స్ తో మెరుపు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఇరాన్ కు యెమెన్ లోని హౌతీ తిరుగుబాటు దారులు, లెబనాన్ లో హెజ్బోల్లా గ్రూపు, సిరియన్ సైన్యం నుంచి కూడా మద్దతు లభించింది.


మరోవైపు ఇజ్రాయెల్ రక్షణకు దాని మిత్ర దేశాలు అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ అరబ్ దేశాలైన జోర్డాన్, సౌదీ అరేబియా, యూఏఈ మద్దతుగా నిలిచి సహాయం అందించాయి. అయితే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య దాడుల నేపథ్యంలో ఏయే దేశాలు ఎవరికి మద్దతు నిలుస్తున్నాయనే చర్చ నడుస్తోంది.


ఇజ్రాయెల్ కు మిత్ర దేశం అమెరికా సాయం, ఐరన్ డోమ్ రక్షణతో అక్టోబరు 2023 నుంచి హమాస్, హిజ్బోల్లా, హౌతీ తిరుగుబాటు దారులతో పోరాడుతోంది. ఇరాన్, దాని మద్దతు మిలిటెంట్ గ్రూపులు దాడులు చేస్తూ.. హెచ్చరిస్తున్నా గాజాలో హమాస్ ను తుది ముట్టించేవరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెబుతోంది. ఇజ్రాయెల్ కు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జోర్డాన్, సౌదీ అరేబియా అనుకూలంగా ఉన్నాయి. ఇక ఇరాన్ విషయానికొస్తే.. దాని మిత్రపక్షాలుగా యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్, హమాస్ లు ఉన్నాయి. ప్రత్యర్థులుగా ఇజ్రాయెల్, అమెరికా, సౌదీ అరేబియా ఉన్నాయి. ఇక భారత్ విషయానికొస్తే ఆది నుంచి ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలుస్తోంది. తీవ్ర వాదాన్ని వ్యతిరేకిస్తూ.. పాలస్తీనాలో శాంతి స్థాపనకు కృషి చేయాలని కోరుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: