ఏపీ:కూటమి డిప్యూటీ సీఎంను దూరం పెడుతోందా..?
అయితే ఈ సభ తమ సొంత పార్టీ విషయమే అన్నట్లుగా జనసేన పార్టీ వ్యవహరించినట్లు అక్కడ ఉండే బిజెపి, టిడిపి నేతలు దూరంగా ఉంటున్నారట. అంతేకాకుండా వారాహి డిక్లరేషన్ సభకు కూడా చాలామంది నాయకులు వెళ్లలేదని విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.. తమతో ఎలాంటి విషయం చెప్పకుండా జనసేన పార్టీని సొంతంగా బలపడి ఎదగాలని భాగంగానే ఇలాంటి సభలను నిర్వహిస్తోంది అంటూ పలువురు టిడిపి నాయకులు తెలియజేస్తున్నారట. అయితే తిరుపతికి వచ్చిన పవన్ కళ్యాణ్ చాలా మంది నాయకులు అసలు కలవలేదని జనసేన నాయకులు సైతం వెల్లడిస్తున్నారు.
ఈ సభ వల్ల కూటమినేతలకు ప్రాధాన్యత ఏమి ఉండదని కేవలం పవన్ కళ్యాణ్ ని హైలైట్ గా నిలిచేలా ప్లాన్ చేసుకుంటున్నారంటూ చాలామంది కూటమినేతలు కూడా విమర్శించారు. మరి కొంతమంది మాత్రం పవన్ కళ్యాణ్ ఎలాంటివి చేసినా ఒక వివాదంగా మారుతోంది. ఆయనను పట్టించుకునే ఆలోచనలో ప్రజలు లేరనే ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి పరిణామాలన్నీ చూస్తే కూటమిలో కచ్చితంగా వ్యతిరేకత ఏర్పడే ప్రమాదం ఉందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే జనసేన నేతలు కార్యకర్తలు మాత్రం ఇకమీదటైనా ఏదైనా విషయం పై నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి అడుగులు వేయాలి అంటూ సలహా ఇస్తున్నారు. వీటన్నిటిని చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో కూటమి కూడా డిప్యూటీ సీఎంను దూరం పెట్టేలా కనిపిస్తోంది..అలాగే ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాలను కూడా నెరవేర్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు.